Ola Roadster 9.1: ఓలా రోడ్‌స్టర్ 9.1 ధర భారీగా తగ్గింపు.. ప్లాటినా కంటే తక్కువ ఖర్చుతో పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్ అయిన ఓలా రోడ్‌స్టర్ X+ 9.1 ధరను రూ.60,000 వరకు తగ్గించింది. ముందుగా రూ.1,89,999 ఉన్నఈ బైక్ ఇప్పుడు రూ.1,29,999కి అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌లో కంపెనీ తయారు చేసిన 4680భారత్ సెల్ బ్యాటరీ ఉండగా,ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. విద్యుత్ యూనిట్ ధర రూ.5గా తీసుకుంటే,పూర్తి ఛార్జ్ ఖర్చు కేవలం రూ.46మాత్రమే అవుతుంది. అంటే ఒక్క కిలోమీటర్‌కు సుమారు రూ.0.09ఖర్చుతో నడుస్తుంది. ఇక Bajaj Platina 110 బైక్'తో పోలిస్తే రన్నింగ్ ఖర్చు సుమారు రూ.1.35ప్రతి కిలోమీటర్‌గా ఉంటుంది. ప్లాటినా మైలేజ్ 70 kmplగా,పెట్రోల్ ధర రూ.94.77గా తీసుకుంటే ఈ లెక్క వస్తుంది.
వివరాలు
ఓలా రోడ్‌స్టర్ X+ 9.1 రూ.1.29 లక్షలు
మొదట కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజువారీ వినియోగంలో ఓలా బైక్ చాలా చవకగా ఉంటుంది. ఈ ఖర్చు తేడా సమానమయ్యేందుకు సుమారు 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని అంచనా. ధరల విషయానికి వస్తే, ప్లాటినా 110 ఎక్స్‌షోరూమ్ ధర రూ.69,800 నుంచి ప్రారంభమవుతుండగా, ఓలా రోడ్‌స్టర్ X+ 9.1 ఇప్పుడు రూ.1.29 లక్షలుగా ఉంది. ఈ ధర తగ్గింపుకు గిగాఫ్యాక్టరీలో పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం, బ్యాటరీ తయారీలో స్వీయ నియంత్రణ కారణమని కంపెనీ తెలిపింది.
వివరాలు
ఏప్రిల్ 3న మొదటి సేల్
ఇంకా, ఈ బైక్‌ను ఇప్పుడు ఓపెన్ సేల్‌లో కాకుండా పరిమిత స్లాట్లలో విక్రయించనున్నారు. మొదటి సేల్ ఏప్రిల్ 3న సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ చెప్పింది. మార్చిలో ఓలా విక్రయాలు 150%కిపైగా పెరిగినట్లు కూడా సమాచారం. మొత్తానికి, తక్కువ రన్నింగ్ ఖర్చు, తగ్గిన ధరతో ఈ బైక్ మార్కెట్లో బలంగా నిలబడే అవకాశం ఉంది.