
Ola : 250 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలు మళ్లీ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మరోసారి వాయిదా పడ్డాయి. తొలుత మార్చి 2025లో డెలివరీలు ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ హామీ ఇచ్చింది.
ఆ తర్వాత ఏప్రిల్‌కు తరలించగా, ఇప్పుడు మేలో అందుబాటులోకి వస్తాయని తాజాగా ప్రకటించింది.
హోమోలాగేషన్ ప్రక్రియ ఆలస్యమే ప్రధాన కారణమా?
ఓలా సంస్థ ఈ ఆలస్యంపై స్పష్టమైన ప్రకటన చేయకపోయినా, అనేక నివేదికల ప్రకారం రోడ్‌స్టర్ ఎక్స్ హోమోలాగేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడమే డెలివరీల ఆలస్యానికి కారణమని చెబుతున్నాయి.
ఏప్రిల్ 11, 2025న తొలి బ్యాచ్ తయారీ కేంద్రం నుంచి విడుదలైనట్టు ఓలా పేర్కొన్నా, వాహనాల డెలివరీలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
Details
డెలివరీలపై అనుమానాలు
రోడ్‌స్టర్ ఎక్స్‌తో పాటు, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో మోడళ్లను కూడా ఓలా ప్రదర్శించిన విషయం తెలిసిందే.
అయితే రోడ్‌స్టర్ ఎక్స్ వరుసగా వాయిదాలు పడుతుండటంతో, మిగిలిన రెండు మోడళ్ల విడుదలపై కూడా ప్రభావం పడుతుందేమోనన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
బుకింగ్స్ ఉన్నా.. డెలివరీలు ఎప్పుడు?
ఫిబ్రవరి అమ్మకాల గణాంకాల్లో ఓలా 1,395 రోడ్‌స్టర్ ఎక్స్ బుకింగులను చేర్చింది. కానీ ఈ బైక్‌ల డెలివరీలు జరగకపోవడం రెగ్యులేటరీ అధికారుల దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఇన్సైడర్ ట్రేడింగ్, సంబంధిత పార్టీ లావాదేవీలపై సెబీ దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Details
రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ స్పెసిఫికేషన్లు, ధరలు
అయితే, ఈ ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టింది. సెబీ దర్యాప్తుపై ప్రచారంలో ఉన్న కథనాల్లో నిజం లేదు. అవి ఓలా ఎలక్ట్రిక్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఓలా అధికారికంగా వివరణ ఇచ్చింది.
రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ ధర: రూ. 74,999 (ఎక్స్-షోరూమ్)
లభ్యమయ్యే మూడు వేరియంట్లు
బేస్ వేరియంట్ : 2.5 కిలోవాట్ బ్యాటరీ, 140 కిమీ రేంజ్
మిడ్ వేరియంట్ : 3.5 కిలోవాట్ బ్యాటరీ, 196 కిమీ రేంజ్
టాప్ వేరియంట్ : 4.5 కిలోవాట్ బ్యాటరీ, 252 కిమీ రేంజ్
ఈ మూడు వేరియంట్లలో 7 కిలోవాట్ మిడ్-డ్రైవ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ (9.3 bhp) అమర్చారు. ఇక మేలోనైనా డెలివరీలు జరుగుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.