Page Loader
OLA: ఓలా కీలక నిర్ణయం.. మొత్తం సంపాదన డ్రైవర్లదే అంటున్న కంపెనీ!
ఓలా కీలక నిర్ణయం.. మొత్తం సంపాదన డ్రైవర్లదే అంటున్న కంపెనీ!

OLA: ఓలా కీలక నిర్ణయం.. మొత్తం సంపాదన డ్రైవర్లదే అంటున్న కంపెనీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్రముఖ రైడ్-హెయిలింగ్ సేవలందించే ఓలా తన వ్యాపార మోడల్‌లో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ 'జీరో కమిషన్ మోడల్'‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద డ్రైవర్ల నుంచి ఒక్క రైడ్‌కైనా కంపెనీ కమిషన్ వసూలు చేయదు. ఈ విధానం ద్వారా డ్రైవర్ల ఆదాయం 20 నుంచి 30 శాతం వరకు పెరగనుందని ఓలా అభిప్రాయపడుతోంది. డ్రైవర్ల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Details

 దేశవ్యాప్తంగా అమలు

ఈ జీరో కమిషన్ మోడల్‌ను ఓలా దేశవ్యాప్తంగా అమలు చేసింది. దీనివల్ల ప్రత్యక్షంగా లాభం డ్రైవర్లకు జరుగనుంది. కొత్త విధానాన్ని స్వాగతించిన డ్రైవర్లు - ఇకపై తమ సంపాదన మొత్తాన్ని పూర్తిగా తమ వద్ద ఉంచుకునే అవకాశం ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సంస్థలతో తేడా ఉబర్ వంటి ఇతర కంపెనీలు సాధారణంగా డ్రైవర్ల నుంచి ప్రతి రైడ్‌పై 20-30% వరకు కమిషన్ వసూలు చేస్తుంటే, ఓలా మాత్రం పూర్తిగా కొత్త దారి ఎంచుకుంది. కొత్త మోడల్ కింద డ్రైవర్లు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా ఓలా ప్లాట్‌ఫామ్ ఉపయోగించినందుకు స్థిర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Details

ఆటో, బైక్, క్యాబ్‌లకు వర్తింపు 

ఇది ఒక రకంగా "సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్" (SaaS) విధానంగా పేర్కొనవచ్చు. ఈ ఫీజు రోజుకు సుమారు రూ.67, నెలకు రూ.2010 వరకూ ఉండవచ్చని అంచనా. ఈ జీరో కమిషన్ మోడల్ కేవలం కార్లు మాత్రమే కాకుండా బైక్, ఆటో, క్యాబ్ సేవలందించే డ్రైవర్లందరికీ వర్తిస్తుంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా డ్రైవర్లు దీనిని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకపై ప్రయాణ ఛార్జీలను డ్రైవర్లు పూర్తిగా తమ ఖాతాలోకి మార్చుకోవచ్చు.

Details

ప్రయాణికులకు ఎలాంటి ప్రభావం లేదు 

ఓలా చెబుతున్న దానిప్రకారం, ఈ మార్పు ప్రయాణికుల భద్రతపై, సేవా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం చూపదు. మునుపటిలాగే నాణ్యమైన సేవను అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంటుందని తెలిపింది. కొత్త మోడల్ ద్వారా డ్రైవర్ల నెలవారీ ఆదాయం 20-30శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ప్రతి డ్రైవర్‌కు రోజూ ఎక్కువ రైడ్స్ ఉండకపోతే, వారు చెల్లించాల్సిన స్థిరమైన ఫీజు ఓ భారం కావచ్చు. ఇది తక్కువగా రైడ్స్ చేసే డ్రైవర్లను ఆలోచింపజేయవచ్చు. ఇక బిజినెస్ వ్యూహ పరంగా చూస్తే - ఇతర కంపెనీలు కూడా ఓలా మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఇది మార్కెట్‌లో పోటీని తీవ్రతరం చేస్తుంది.