Ola S1X : తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. త్వరలో 'S1X' లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓలా S1 సిరీస్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది.
ఓలా నుంచి వచ్చిన S1, S1 ప్రో, S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.
ఓలా ఎస్1ఎక్స్ ఈనెల 15న ఇండియాలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ ఎస్ 1 ఎయిర్ ధర కన్నా తక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల ఓలా కంపెనీ 'S1 ఎయిర్' ను రూ.1.10 లక్షల బేస్ ధరతో రిలీజ్ చేసింది. తాజాగా S1X పేరుతో కొత్త స్కూటర్‌ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంది.
సరసమైన ధరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభించనున్నట్లు సమాచారం.
Details
ఆగస్టు 15న ఓలా S1X లాంచ్
ఓలా S1 స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో గ్యాస్ ఛార్జ్డ్ షాక్ అబ్సార్బర్స్ ఉండొచ్చు. ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ రానున్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు అలాయ్ వీల్స్ స్థానంలో స్టీల్ వీల్స్ వస్తాయని టాక్ నడుస్తోంది.
డిజైన్ పరంగా ఓలా వాహనాల్లో పెద్దగా మార్పులు ఉండటం లేదు.
ఈ ఓలా ఎస్1ఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.10లక్షలు ఉండే అవకాశం ఉంది. ఆగస్ట్ 15 లాంచ్ టైమ్‌లో ఈ మోడల్‌పై మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.