Page Loader
సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100
లోపల డోర్ సిల్స్‌పై "60వ వార్షికోత్సవం" బ్యాడ్జ్‌లు ఉంటాయి

సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 22, 2023
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటాలియన్ సూపర్ కార్ మార్క్ Lamborghini Huracan STO Time Chaser_111100 ను ప్రకటించింది. కంపెనీ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జపాన్ అద్భుత డిజైనర్ IKEUCHI సహకారంతో ప్రత్యేకమైన మోడల్ రూపొందించింది. సైబర్‌పంక్ 2077 నుండి ప్రేరణ పొందిన వీడియో గేమ్‌లోని వివిధ అంశాలను స్టాండర్డ్ STO మోడల్‌తో కలిపారు. '111100' అనేది 60 సంఖ్యకు బైనరీ కోడ్. 2014లో ప్రారంభమైన Huracan లంబోర్ఘిని ఉత్పత్తుల్లో అత్యధికంగా అమ్ముడైన సూపర్ కార్లలో ఒకటి. ఈ వాహనం కేవలం ఎనిమిదేళ్లలో 20,000 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది ట్రాక్-ఫోకస్డ్ STO వెర్షన్‌పై ఆధారపడింది, ఇది శక్తివంతమైన 5.2-లీటర్, న్యాచురల్ -ఆస్పిరేటెడ్ V10 పెట్రోల్ ఇంజన్‌ తో నడుస్తుంది.

కార్

లోపల డోర్ సిల్స్‌పై ప్రత్యేకమైన "60వ వార్షికోత్సవం" బ్యాడ్జ్‌లు ఉంటాయి

డిజైనర్ IKEUCHI సైబర్‌పంక్, రోబోట్ యానిమే నుండి ఇందులో వివిధ డిజైన్ ఎలిమెంట్‌లను ఉపయోగించారు, గ్రాఫిక్ కార్డ్‌లను పోలి ఉండే వివిధ రంగుల ప్యానెల్‌లతో వెనుకవైపు ఫాక్స్ PC కేస్ వంటివి అమర్చారు. దీని లోపలి భాగంలో, డోర్ సిల్స్‌పై ప్రత్యేకమైన "60వ వార్షికోత్సవం" బ్యాడ్జ్‌లు ఉంటాయి. ఇందులో రెండు రేసింగ్-టైప్ బకెట్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్‌లతో ఉన్న ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ప్రత్యేకమైన Huracan STO Time Chaser_111100 ధర వివరాలను Lamborghini ఇంకా ప్రకటించలేదు, ఎందుకంటే ఇది బ్రాండ్ 60వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందింది కాబట్టి ఆ తర్వాత వేలం వేయవచ్చు.