Page Loader
స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు
ENTOP సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది

స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 17, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది. రెండేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన విధించినప్పటి నుండి, దేశంలో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అయితే, అటువంటి సమయాల్లో అక్కడే అభివృద్ధి చేసిన ఉత్పత్తిని ఆవిష్కరించడం అనేది ఆ దేశ ఆర్ధిక అభివృద్ధిపై ఆశలు చిగురించింది. ఈ కార్ నల్లని రంగు పెయింట్ తో వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు.

కార్

ఇంకా ప్రోటోటైప్ దశలోనే ఉన్న ఈ సూపర్ కార్

ఐదేళ్లపాటు, 30 మంది ఇంజనీర్లు మాడా 9లో పనిచేశారు. మాడా 9లో తక్కువ-స్లాంగ్ డిజైన్‌ తో వాలుగా ఉండే రూఫ్‌లైన్, విశాలమైన ఎయిర్ వెంట్, LED హెడ్‌లైట్లు ఉన్నాయి. దీని 2-సీటర్ క్యాబిన్‌ లో AC వెంట్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ ఉంటుందని భావిస్తున్నారు. దీనికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, తాజా కనెక్టివిటీ సౌకర్యాలతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండే అవకాశముంది. ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా తో పాటు ప్రయాణీకుల భద్రత కోసం ABS ఫంక్షన్ ఇందులో ఉన్నాయి. మాడా 9 సూపర్‌కార్ ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉంది. ఇది ఎప్పుడు ఉత్పత్తికి వెళ్తుందనేది తెలియదు. వాహనం ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.