Loading...
Porsche's: పోర్షే ఎంట్రీ లెవల్ రేసింగ్ కారు.. ధర అక్షరాలా రూ.2.3 కోట్లు!
పోర్షే ఎంట్రీ లెవల్ రేసింగ్ కారు.. ధర అక్షరాలా రూ.2.3 కోట్లు!

Porsche's: పోర్షే ఎంట్రీ లెవల్ రేసింగ్ కారు.. ధర అక్షరాలా రూ.2.3 కోట్లు!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 27, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

లగ్జరీ కార్ తయారీ సంస్థ పోర్షే మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో కొత్త రేసింగ్ కారును ఆవిష్కరించింది. '911 ఛాలెంజ్' పేరుతో తీసుకొచ్చిన ఈ మోడల్‌ను సంస్థ తన ఎంట్రీ లెవల్ రేస్ కారుగా పరిచయం చేసింది. రోడ్డుపై తిరిగే 911 GT3 ఆధారంగా దీన్ని రూపొందించారు. GT3లో ఉపయోగించిన ఫ్లాట్-సిక్స్ ఇంజిన్, చాసిస్, గేర్‌బాక్స్‌లనే ఈ రేసింగ్ కారులోనూ వినియోగించారు. అయితే రేసింగ్‌కు అనుగుణంగా కారును మరింత తేలికగా, సమర్థంగా మార్చేందుకు కొన్ని సౌకర్యాలను తొలగించారు. ఇందులో ఎయిర్‌బ్యాగులు, కార్పెటింగ్, ఇన్సులేషన్ వంటి అవసరం లేని అంశాలను తీసివేశారు.

వివరాలు

GT3 నుంచి 4.0 లీటర్ ఇంజిన్..

పోర్షే 911 ఛాలెంజ్ ధర 275,000 డాలర్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లకు పైగా ఉంటుంది.

పోర్షే మోటార్‌స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో ఇదే అత్యంత అందుబాటు ధరలో లభించే రేసింగ్ కారు అని సంస్థ తెలిపింది.

ఈ కారులో రోడ్-లీగల్ 911 GT3 నుంచి తీసుకున్న నేచురల్లీ ఆస్పిరేటెడ్ 4.0 లీటర్ ఫ్లాట్-సిక్స్ ఇంజిన్ను అమర్చారు.

ఈ ఇంజిన్ గరిష్ఠంగా 9,000 ఆర్‌పీఎం వరకు దూసుకెళ్తుంది. అలాగే 508 హెచ్‌పీ పవర్, గరిష్ఠంగా 471 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

రోడ్డుపై నడిచే GT3తో పోలిస్తే 911 ఛాలెంజ్ మరింత అధిక పవర్‌ను అందిస్తుంది.

అదే సమయంలో రేసింగ్ అవసరాలకు అనుగుణంగా ఖర్చును నియంత్రించేలా దీన్ని రూపొందించారు.

వివరాలు

అవసరం లేని ఫీచర్లకు గుడ్‌బై..

రేసింగ్‌లో పనికిరాని అదనపు బరువును తగ్గించేందుకు 911 ఛాలెంజ్ క్యాబిన్‌లోని పలు అంశాలను తొలగించారు.

ఎయిర్‌బ్యాగులు, ప్రయాణికుడి సీటు, ఇంటీరియర్ ట్రిమ్, సౌండ్ ఇన్సులేషన్, ఫ్లోర్ మ్యాట్స్ వంటి వాటిని ఇందులో ఉంచలేదు.

అయితే డ్రైవర్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను మాత్రం కొనసాగించారు.

GT3 RS నుంచి మార్పులు చేసిన స్టీరింగ్ వీల్‌ను కూడా ఈ కారులో అమర్చారు.

మాన్యువల్‌గా గేర్‌లను మార్చుకునేందుకు స్టీరింగ్‌పై ప్యాడిల్స్ అందించారు.

భద్రత కోసం కారులో వెల్డ్ చేసిన రోల్ కేజ్, ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిస్టమ్, ఆరు పాయింట్ల సేఫ్టీ హార్నెస్‌తో కూడిన అడ్జస్టబుల్ రేసింగ్ బకెట్ సీట్ వంటి ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

వివరాలు

బరువు 1,450 కిలోలు..

911 ఛాలెంజ్ బరువు సుమారు 1,450 కిలోలు. అంటే సాధారణ 911 GT3 బరువుకు దాదాపు సమానమే.

అయితే ఈ బరువులో ప్రయాణికుడి వైపు అమర్చిన 18 కిలోల బ్యాలస్ట్ కూడా ఉంది.

అంతేకాకుండా ఇందులో రవాణా సమయంలో ఉపయోగించే సన్నని టైర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పలు వన్-మేక్ రేసింగ్ సిరీస్‌లలో పోర్షే 911 ఛాలెంజ్ పోటీపడేందుకు అర్హత కలిగి ఉంది.

2027 రేసింగ్ సీజన్‌లో ఈ కొత్త కారు ట్రాక్‌పైకి దిగనుంది. తద్వారా ఎంట్రీ లెవల్ రేసింగ్ కారుగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కనుంది.

ADVERTISEMENT