Page Loader
Tata Motors : ఫిబ్రవరిలో 'టాటా మోటార్స్' అన్ని కార్ల ధరల పెంపు 
Tata Motors : ఫిబ్రవరిలో 'టాటా మోటార్స్' అన్ని కార్ల ధరల పెంపు

Tata Motors : ఫిబ్రవరిలో 'టాటా మోటార్స్' అన్ని కార్ల ధరల పెంపు 

వ్రాసిన వారు Stalin
Jan 21, 2024
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం ప్రారంభించాయి. ఇప్పటికే మారుతి సుజుకీ తన వాహనాల ధరలను పెంచింది. ఇప్పుడు తాజాగా 'టాటా మోటార్స్' ధరల పెంపును ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2024 నుంచి తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ తన వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలను 0.7 శాతం పెంచబోతోంది. ఈ జాబితాలో పంచ్, నెక్సాన్, సఫారి, హారియర్, టియాగో వంటి వాహనాలు ఉన్నాయి. టాటా తన ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచుతుందా లేదా అనే దానిపై ఇంకా సమాచారం లేదు.

కారు

హ్యుందాయ్ వాహనాల ధరలు కూడా..

హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఎంపిక చేసిన వాహనాల ధరలను రూ.12,900 వరకు పెంచింది. హ్యుందాయ్ అల్కాజార్ డీజిల్ వేరియంట్‌ల ధరలను కంపెనీ రూ.4,900 వరకు పెంచింది. హ్యుందాయ్ వెర్నా అన్ని వేరియంట్‌లపై రూ.3,900 పెంచింది. ధరలు పెరిగిన కారణంగా హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20లను కొనుగోలు చేయడానికి రూ. 4,900 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ వేరియంట్ ఎరా ధర రూ. 7,900 పెరగగా, మిగతా అన్ని వేరియంట్‌లు రూ. 4,900 వరకు పెరిగాయి. మాగ్నా, స్పోర్ట్ CNG ధరలో ఎటువంటి మార్పు లేదు.