Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి పల్సర్ ఎస్ 150 లాంచ్.. ధర ఎంతంటే?
దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త బైకును ఇండియాలో లాంచ్ చేసింది. యువతను ఆకర్షించే విధంగా బజాజ్ పల్సర్ ఎన్150 మోడల్ ను మార్కెట్లోకి తీసుకుంది. నూతన లుక్‌తో వస్తున్న ఈ 2 వీలర్ ఫీచర్స్, ధర వంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.. బజాజ్ సంస్థ పల్సర్ లైనప్‌తో వస్తున్న ఈ బైకు డిజైన్‌లో చాలా మార్పులను చేసింది. ఈ మోటార్‌సైకిల్ రేసింగ్ రెడ్, మెటాలిక్ పెరల్ వైట్, ఎబోనీ బ్లాక్ కలర్స్‌లో వస్తోంది. ఈ బైకులోని ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అగ్రెసివ్ లుక్ ని ఇస్తోంది. ఇది కాంట్రాస్ట్ ఫినిషింగ్, పియర్సింగ్ కలర్ బ్రేక్‌లతో రానుంది.
బజాబ్ పల్సర్ N150 అధునాతన ఫీచర్లు
బైక్‌లో కాంటౌర్డ్ స్టెప్డ్-అప్ సీట్, సొగసైన ఎగ్జాస్ట్, USB పోర్ట్, ఫ్లోటింగ్-స్టైల్ బాడీ ప్యానెల్‌లు వంటివి ఈ బైకులో ఉండనున్నాయి. ఇది N160 కంటే 7కేజీలు బరువు తక్కువగా ఉంటుంది. ఈ బజాబ్ పల్సర్ ఎన్150ay 149.68సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్-ఎఫ్ఐ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండనుంది. ఇది 14.3 హెచ్ పీ పవర్‌ను, 13.5 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లభించనుంది. ఈ బైకు లీటరుకు 45 నుంచి 50కి.మీ మైలేజీని అందిస్తుంది. బజాబ్ పల్సర్ N150 ధర భారతదేశంలో రూ.1.18 లక్షలు ఉండనుంది.