Page Loader
భారతదేశంలో  చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV
PURE ecoDryft ఒక్కసారి చార్జ్ చేస్తే 130కిమీల వరకు నడుస్తుంది

భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 31, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది. భారతదేశంలో PURE ecoDryft అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. దేశంలోని ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దాదాపు 65% కమ్యూటర్ బైక్‌లు ఉన్నాయి అది ecoDryft అమ్మకాలు పెరగడానికి సహాయపడవచ్చు. పెరుగుతున్నపెట్రోల్ ధరలు, కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరిగింది, ముఖ్యంగా వినియోగదారులకు మిగిలిన ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఈ ecoDryft అందుబాటు ధరలో లభిస్తుంది. .

బైక్

ఈ PURE ecoDryft ఒక్కసారి చార్జ్ చేస్తే 130కిమీల వరకు నడుస్తుంది

మోటార్‌సైకిల్ బరువు 101 కిలోలు ఉంటుంది. ఇది నలుపు, ఎరుపు, బూడిద, నీలం రంగులలో లభిస్తుంది. PURE ecoDryft 3kWh బ్యాటరీ 3kW మోటార్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. 75km/h వేగంతో, ఒక్కో ఛార్జ్‌కు 130km వరకు నడుస్తుంది. రైడర్ భద్రత కోసం ముందు చక్రంపై డిస్క్ బ్రేక్, వెనుక చక్రంపై డ్రమ్ బ్రేక్‌ అమర్చారు. దీనిలో డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. PURE ecoDryft ధర న్యూఢిల్లీలో రూ. 99,999, మిగిలిన ప్రాంతాలలో రూ.1.15 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). మార్చి మొదటి వారం నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.