LOADING...
Range Rover: భారత్‌లోకి విడుదలైన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ .. ధర ఎంతంటే?
భారత్‌లోకి విడుదలైన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ .. ధర ఎంతంటే?

Range Rover: భారత్‌లోకి విడుదలైన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ .. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ కొత్తగా రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీను విడుదల చేసింది. ఈ లగ్జరీ హై-పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ కార్ ధర రూ.2.05 కోట్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. దీంతో ప్రీమియం పనితీరుతో కూడిన రేంజ్ రోవర్ మోడల్ మరింత మందికి అందుబాటులోకి వచ్చినట్టైంది. ఇటీవల భారత్-యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలుకు ముందు ప్రీమియం రేంజ్ రోవర్ మోడళ్ల ధరల్లో మార్పులు చేసిన నేపథ్యంలో, పరిమిత ఎడిషన్‌గా వచ్చిన ఎస్‌వీ ఎడిషన్ టూ కంటే ఇది రూ.30 లక్షలు తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తొలి డెలివరీలు 2026 ఆగస్టు నుంచి ఇవ్వనున్నారు.

వివరాలు

ఫీచర్లు ఇవే..

భారత కస్టమర్ల కోసం 2026 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ ప్రత్యేక పెయింట్ ఆప్షన్లతో అందిస్తున్నారు. శాటిన్ గ్రీన్, మ్యాట్ ఆరెంజ్, గ్లోస్ బ్లూ, మ్యాట్ వైలెట్, గ్లోస్ టీల రంగులు ఇందులో ఉన్నాయి. వీటికి బ్లాక్ రూఫ్‌తో పాటు ప్రత్యేక 22 అంగుళాల ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్‌ను జత చేశారు. ఈ ఎస్‌యూవీలో ఎస్‌వీ బ్యాడ్జ్‌లు, క్వాడ్ ఎగ్జాస్ట్‌లు, పెద్ద రియర్ స్పాయిలర్‌తో అగ్రెసివ్ లుక్ ఇచ్చారు. పిల్లర్స్, ఓఆర్వీఎం హౌసింగ్స్, ల్యాండ్ రోవర్ లెటరింగ్, ఫ్రంట్ స్ప్లిట్టర్, గ్రిల్, ఎయిర్ ఇంటేక్స్ వంటి భాగాలకు బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఎడిషన్ టూ వేరియంట్‌లో ఉన్న 23 అంగుళాల కార్బన్ ఫైబర్ వీల్స్, బ్రెంబో కార్బన్-సెరామిక్ బ్రేక్స్ ఈ మోడల్‌లో లేవు.

వివరాలు

లగ్జరీ డ్రైవ్‌కు అనువైన కంఫర్ట్‌..

ఇంటీరియర్ విషయానికి వస్తే, లైట్ క్లౌడ్, ఎబోనీ కలర్‌లో పెర్ఫొరేటెడ్ విండ్సర్ లెదర్ సీట్లు ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తాయి. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా స్లైడింగ్ పానోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. అదనంగా ఎక్స్‌టెండెడ్ లెదర్ ప్యాకేజ్, మెరిడియన్ సిగ్నేచర్ సౌండ్ సిస్టమ్, ఇల్యూమినేటెడ్ ఎస్‌వీ బ్రాండెడ్ డోర్ సిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎడిషన్ టూ వేరియంట్‌లో కార్బన్ ఫైబర్ ట్రిమ్ ఉండగా, ఈ ఎస్‌వీ మోడల్ రోజువారీ లగ్జరీ డ్రైవ్‌కు అనువైన కంఫర్ట్‌పై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

Advertisement

వివరాలు

మెరుగైన హ్యాండ్లింగ్‌...

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీలో 4.4 లీటర్ ట్విన్-టర్బో వీ8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 635 హెచ్‌పీ పవర్‌తో పాటు 750 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సహాయంతో ఈ ఎస్‌యూవీ కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 6డి డైనమిక్స్ సస్పెన్షన్ సిస్టమ్‌లో హైడ్రాలిక్ ఇంటర్‌లింక్డ్ సెటప్ ఉండటంతో, వివిధ రోడ్డు పరిస్థితుల్లో కూడా వాహనం స్థిరంగా, మెరుగైన హ్యాండ్లింగ్‌తో ప్రయాణిస్తుంది.

Advertisement