నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV వచ్చేసింది. టాటా మోటర్స్ యాజమన్యంలోని బ్రిటిష్ SUV స్పెషలిస్ట్ ల్యాండ్ రోవర్ మేలో ఆవిష్కరిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. అవసరమైతే డిమాండ్ ను బట్టి ప్రొడక్షన్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది.
రేంజ్ రోవర్ మోడల్స్ లో ఇదే ఫాస్టెస్ట్ ఆండ్ అడ్వాన్స్‌డ్ అని సంస్థ చెబుతోంది. SUVలో మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
అవుట్‌గోయింగ్ మోడల్ తో సహా మొత్తం సిల్హౌట్‌ను కలిగి ఉంది. ఇది క్లామ్‌షెల్ బానెట్‌తో కూడిన సాధారణ బాక్సీ డిజైన్, ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన సొగసైన మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్‌లు, క్రోమ్-ఫినిష్డ్ గ్రిల్, ORVMలు, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, డిజైనర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
Details
రేంజ్ రోవర్ SV SUV లో మైల్డ్- హైబ్రీడ్ టెక్నాలజీ
ముఖ్యంగా వెనుక భాగంలో డ్యూయల్ షార్క్-ఫిన్ యాంటెనాలు, బ్లాక్-అవుట్ వర్టికల్ LED టెయిల్‌లైట్‌లు అందుబాటులో ఉన్నాయి.
లోపలి భాగంలో మినిమలిస్ట్ డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం అప్హోల్స్టరీతో విలాసవంతమైన నాలుగు/ఐదు-సీట్ల క్యాబిన్‌ను కలిగి ఉంది.
13.1-అంగుళాల పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ని కలిగి ఉంది. బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ల ద్వారా ప్రయాణీకులకు మరింత భద్రతను పెంచనుంది.
2024 రేంజ్ రోవర్ SV 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ (606hp/750Nm) మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో జత చేశారు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ EV మోడ్‌లో 100కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. మైల్డ్- హైబ్రీడ్ టెక్నాలజీ కూడా లభించే అవకాశం ఉంది.