Page Loader
న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం
న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా

న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2023
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది. అక్కడ జరుగుతున్న పాత సింగూరు భూవివాదంలో టాటా పెద్ద విజయం సాధించింది. తాజాగా మమతా బెనర్జీ ప్రభుత్వం గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్‌కు రూ.766 కోట్లు ఇవ్వనుంది. సింగూర్‌లో కార్ల తయారీ ప్లాంట్ వదిలి పెట్టి పోవాల్సిన వ్యవహారంలో ఏర్పడిన పెట్టుబడి నష్టానికి సంబంధించి దావాలో పశ్చిమ బెంగాల్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌పై టాటా మోటార్స్ విజయం సాధించింది. సింగూరులో టాటా మోటార్స్‌కు చెందిన నానో ప్లాంట్‌కు మమతా బెనర్జీ గతంలో అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ అనుమతి ప్రకారం సింగూరు భూమిలో ఫ్యాక్టరీని స్థాపించాల్సి ఉంది.

Details

11శాతం వార్షిక వడ్డీతో సహా సొమ్ము చెల్లించాలని తీర్పు

తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆమె టాటా గ్రూప్‌కు పెద్ద దెబ్బ వేసింది. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 13 వేల మంది రైతులకు సుమారు 1000 ఎకరాల సింగూరు భూమిని తిరిగి ఇచ్చేలా చట్టం చేయాలని నిర్ణయించుకుంది. ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ ఏకగ్రీవంగా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో టాటా కంపెనీ తెలియచేసింది. ఇక 2016 సెప్టెంబరు ఒకటోతేదీ నుంచి వాస్తవ రికవరీ తేదీ వరకు 11 శాతం వార్షిక వడ్డీతో సహా సొమ్మును చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.