Loading...
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్‌తో అదిరిపోయే SUV
రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్‌తో అదిరిపోయే SUV

Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్‌తో అదిరిపోయే SUV

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault తన ప్రీమియం SUV Rafaleకు కొత్త స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. 'Rafale Hypnotic' పేరుతో వచ్చిన ఈ ప్రత్యేక మోడల్‌.. కంపెనీ లైనప్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని ప్రారంభ ధర 63,550 యూరోలు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.69 లక్షలకు సమానం. ఈ ధరతో Renault Rafale Hypnotic ఇప్పటివరకు కంపెనీ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన SUVగా నిలిచింది. దీని ధర Audi Q5 Sportback, BMW X4, Mercedes-Benz GLC Coupé వంటి ఎంట్రీ-లెవల్ లగ్జరీ SUVల ధరల శ్రేణికి దగ్గరగా ఉండటం విశేషం.

వివరాలు

ప్రత్యేకమైన డిజైన్

Rafale Hypnotic స్పెషల్ ఎడిషన్‌ను Atelier Alpine ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. ఈ SUVలో ప్రత్యేకమైన Satin Forest Black పెయింట్ షేడ్‌ను అందించారు.

సహజ కాంతి పడినప్పుడు ఈ రంగులో ఆకుపచ్చ లేదా రైన్‌బో తరహా స్వల్ప మెరుపు కనిపించేలా ప్రత్యేక ఫినిషింగ్ ఇచ్చారు.

SUV ముందు భాగంలో బ్లాక్-అవుట్ గ్రిల్‌తో పాటు డార్క్ ఫినిషింగ్‌లో Renault లోగోను అందించారు.

ఇందులోని 21 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కూడా ప్రత్యేక Satin ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

వివరాలు

ఎక్స్‌టీరియర్‌ అంతా బ్లాక్ థీమ్

Rafale Hypnoticలో వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, రూఫ్ స్పాయిలర్, బూట్ స్పాయిలర్, రియర్ బంపర్ వంటి ప్రాంతాల్లో గ్లోస్ బ్లాక్ యాక్సెంట్లు ఉన్నాయి.

ఈ డార్క్ థీమ్‌ SUV మొత్తం డిజైన్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. కారు లోపలి భాగంలోనూ ఇదే డార్క్ థీమ్‌ను కొనసాగించారు.

క్యాబిన్‌లో Alcantara, టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీని ఉపయోగించారు. సీట్లపై ఇల్యూమినేటెడ్ Alpine ఎంబ్లమ్‌లను అందించారు.

డ్యాష్‌బోర్డ్‌పైనా Alcantara ట్రీట్‌మెంట్ కనిపిస్తుంది. అంతేకాకుండా Hypnotic స్పెషల్ ఎడిషన్‌లోని ప్రతి వాహనానికి సెంటర్ కన్సోల్‌పై ప్రత్యేక నంబర్డ్ ప్లేక్‌ను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

వివరాలు

ఫీచర్లకు కొదవ లేదు

Rafale Hypnoticలో ప్రీమియం ఫీచర్లకు పెద్దపీట వేశారు.

ఇందులో LED Matrix Vision హెడ్‌లైట్లు, 9-స్పీకర్ Harman Kardon ఆడియో సిస్టమ్, Solarbay ప్యానరమిక్ గ్లాస్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

అదే విధంగా హీటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీట్‌కు మసాజ్ ఫంక్షన్, పుడిల్ లైట్లు వంటి సదుపాయాలను కూడా అందించారు.

ADVERTISEMENT

వివరాలు

300hp ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే Renault Rafale Hypnoticలో కంపెనీకి చెందిన 300hp E-Tech 4×4 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించారు.

ఇందులో 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి.

పెట్రోల్ ఇంజిన్ 150hp పవర్‌, 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ సిస్టమ్‌లోని ఎలక్ట్రిక్ మోటార్లలో ముందు భాగంలో ఉన్న మోటార్ 70hp పవర్‌, 205Nm టార్క్‌ను అందిస్తుంది.

వెనుక భాగంలోని ఎలక్ట్రిక్ మోటార్ 136hp పవర్‌, 195Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మూడో ఎలక్ట్రిక్ మోటార్ 34hp పవర్‌, 50Nm టార్క్‌తో హై-వోల్టేజ్ స్టార్టర్ జనరేటర్‌గా పనిచేస్తుంది.

వివరాలు

22kWh బ్యాటరీ.. 1,000 కి.మీ వరకు రేంజ్

ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVలో 22kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు.

WLTP ప్రమాణాల ప్రకారం ఈ బ్యాటరీతో స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మోడ్‌లో 105 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

మొత్తం డ్రైవింగ్ రేంజ్ సుమారు 1,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని Renault పేర్కొంది. ఈ SUVలో ఆటోమేటిక్ మల్టీ-మోడ్ డాగ్-క్లచ్ గేర్‌బాక్స్‌ను అందించారు.

పనితీరు పరంగానూ Rafale Hypnotic ఆకట్టుకునే గణాంకాలను కలిగి ఉంది. ఈ SUV గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో చేరుకోగలదని కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT