Revolt RV BlazeX: రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ విడుదల.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని విస్తరించింది.
ఈ క్రమంలో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ (Revolt RV BlazeX) ను విడుదల చేసింది.
ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీతో రూపొందిన ఈ బైక్‌ను రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా ప్రకటించారు.
ఇది సంస్థ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్వీ1 కంటే అధిక సామర్థ్యంతో కూడిన ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది.
వివరాలు
డిజైన్ & లుక్
కస్టమర్లకు మరిన్ని ఎంపికలు అందించేందుకు, ఈ బైక్‌ను స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ అనే రెండు రంగుల వేరియంట్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందు భాగంలో స్టోరేజ్ బాక్స్, సీటు కింద ఛార్జింగ్ కంపార్ట్‌మెంట్ వంటి కొత్త ఫీచర్లను అందించారు.
ఫిబ్రవరి 25 నుంచి ఈ మోడల్ బుకింగ్ ప్రారంభమైంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్‌ల ద్వారా కేవలం రూ. 499 టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
రూపురేఖల పరంగా ఈ కొత్త బైక్, రివోల్ట్ ఇటీవల విడుదల చేసిన ఆర్వీ1 మోడల్‌ను పోలి ఉంటుంది.
గుండ్రని ఆకారంలోని హెడ్‌ల్యాంప్, పెట్రోల్ ట్యాంక్ స్థానంలో మస్క్యులర్ ప్యానెల్ వంటి డిజైన్ హైలైట్‌లు ఉన్నాయి.
వివరాలు
అధునాతన ఫీచర్లు
వెనుక భాగంలో సింగిల్-పీస్ సీటు, గ్రాబ్ రైల్ అమర్చారు. రోజువారీ ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
ఈ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అనేక ఆధునిక ఫీచర్లను జోడించారు.
6-అంగుళాల LCD స్క్రీన్ అమర్చారు, ఇది బైక్ వేగం, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్రైవింగ్ రేంజ్, బ్యాటరీ స్థాయిలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
ఇంకా, మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ మోడ్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, రీజెనరేటివ్ బ్రేకింగ్, GPS ఆధారిత జియోఫెన్సింగ్ వంటి యాప్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
వివరాలు
బ్యాటరీ & పనితీరు
బ్లేజ్ ఎక్స్ మోడల్ 3.24 kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది.
ఇది 5.49 bhp పవర్ అవుట్‌పుట్, 45 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
80 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. గరిష్టంగా 85 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
వివరాలు
హార్డ్‌వేర్ & బ్రేకింగ్ సిస్టమ్
ఈ బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్‌తో అందుబాటులో ఉంది.
ముందు, వెనుక రెండింటిలోనూ 240 mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
సీటు ఎత్తు 790 mm, వీల్‌బేస్ 1350 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 80 mm. మొత్తం బరువు 113 కిలోలుగా ఉంది.
IP67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీను ఉపయోగించడంతో, ఇది దుమ్ము, నీరు, సూర్యకాంతిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది.