
Revolt: రివోల్ట్ నుండి RV400 BRZ.. 4.50 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్
ఈ వార్తాకథనం ఏంటి
Revoltమోటార్స్ భారతదేశంలో RV400 BRZ ను రూ. 1.38 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.
ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైనట్లు రివోల్ట్ తెలిపింది.కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా రివోల్ట్ షోరూమ్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
రివోల్ట్ కొత్త విద్యుత్ ఎలిప్స్ రెడ్, కాస్మిక్ బ్లాక్, మిస్ట్ గ్రే, ఇండియా బ్లూ, స్టెల్త్ బ్లాక్, లైటింగ్ ఎల్లో రంగుల్లో లభిస్తుంది.
RV400 BRZ ధర పరంగా రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంటే తక్కువగా ఉంటుంది.
అయితే, పనితీరు,బ్యాటరీ ఛార్జ్ సమయాలకు సంబంధించి క్లెయిమ్ చేయబడిన స్పెసిఫికేషన్‌లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
Details
4.50 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్
రివోల్ట్ RV400 BRZ లో 3.24kWh లిథియం అయాన్ బ్యాటరీ 3KW మిడ్ డ్రైవ్ మోటార్‌ను అమర్చారు.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది.
బ్యాటరీ పరిధి నార్మల్ మోడ్‌లో 100km ,స్పోర్ట్స్‌మోడ్‌లో 80km సదుపాయం ఇచ్చారు.
బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.50 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.
పనితీరు విషయానికొస్తే,RV400 BRZ గరిష్టంగా 85kmph వేగాన్ని అందుకోగలదు.
ఫీచర్ల పరంగా,RV400 BRZ ఒక డిజిటల్ డిస్‌ప్లే,మూడు రైడ్ మోడ్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లేదా CBSని పొందుతుంది.
అయితే, ఇది RV400 పొందే ఫోన్ యాప్ కనెక్టివిటీ ఫీచర్‌ను కోల్పోతుంది. RV400 BRZ ఒబెన్ రోర్, టోర్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు వ్యతిరేకంగా ఉంటుంది.