Page Loader
TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన
వివిధ వర్క్‌షాప్‌లతో కలిసి పనిచేసిన TVS మోటార్

TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 04, 2023
08:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌మేకర్‌లలో ఒకటైన TVS మోటార్ కంపెనీ తన నియో-రెట్రో ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన, అనుకూల-నిర్మిత మోటార్‌సైకిళ్లను గోవాలో జరిగిన TVS MotoSoul 2023 ఈవెంట్ లో ప్రదర్శించింది. బైక్‌లను TVS డిజైన్ టీమ్, JvB మోటో, స్మోక్డ్ గ్యారేజ్, రాజ్‌పుతానా కస్టమ్స్ రూపొందించాయి. TVS మోటార్ కంపెనీ తమ డిజైనింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ నాలుగు ప్రత్యేక వెర్షన్‌లను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్క్‌షాప్‌లతో కలిసి పనిచేసింది. 'రోనిన్ SCR' ను TVS మోటార్ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ డిజైన్ బృందం రూపొందించింది. ఇందులో అన్నీ వైపులా ట్యాంక్ ప్యాడ్‌లతో డిజైన్ తో ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్, బ్రౌన్-కలర్ రైడర్-ఓన్లీ సాడిల్, వెనుక-మౌంటెడ్ లగేజ్ రాక్ ఉంది.

బైక్

జర్మనీకి చెందిన జెవిబి మోటోకు వచ్చిన ఆలోచన అగొండాగా రూపొందింది

గోవాలోని అగోండా బీచ్ నుండి ప్రేరణ పొందిన 'అగొండా' జర్మనీకి చెందిన జెవిబి మోటో ఆలోచన. ఇది మినిమలిస్ట్ స్క్రాంబ్లర్ డిజైన్‌తో మరియు తెలుపు-రంగు ఫ్రేమ్, హెడ్‌లైట్ కౌల్, నీలం ఎరుపు రంగులతో ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్, సింగిల్-పీస్ సీటుతో వస్తుంది. 'ముసాషి' ఇండోనేషియా ఆధారిత స్మోక్డ్ గ్యారేజ్ నుండి రాడికల్-లుకింగ్ కస్టమ్-బిల్ట్ బ్రాట్ బైక్. ఇందులో తక్కువ ఎత్తులో ఉండే హ్యాండిల్‌బార్, ఫ్లోటింగ్-టైప్ రైడర్-ఓన్లీ శాడిల్, స్మోక్డ్ బ్లాక్ ఎఫెక్ట్‌తో వస్తుంది. రాజ్‌పుతానా కస్టమ్స్ నుండి 'వాకీజాషి' నియో-రెట్రో స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్. ఇది డిజైన్ చేసిన అల్యూమినియం క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, పాతకాలపు బ్లాక్ హెడ్‌లైట్ యూనిట్, బంగారు రంగులో విలోమ ఫోర్క్‌లు, పదునైన-కనిపించే టెయిల్ సెక్షన్‌తో ఉన్న రైడర్-ఓన్లీ శాడిల్‌ ఉంది.