
భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.
మార్కెట్లో ఇది KTM 390 డ్యూక్, BMW G 310 R, బజాజ్ డొమినార్ 400 లకు పోటీగా ఉంటుంది.
మిడిల్ వెయిట్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో భారతదేశంలో KTM, BMW, బజాజ్ ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, TVS మోటార్ కంపెనీ రాబోయే Apache RTR 310 మోడల్‌తో సబ్-400cc విభాగంలో వీటిపైన పైచేయి సాధించాలని చూస్తుంది.
బైక్
TVS Apache RTR 310 కూడా BTO ప్రోగ్రామ్‌లో భాగం అవుతుంది.
TVS Apache RTR 310 ముందు మోడలైన Apache RR 310లో అప్డేట్ అయిన BS6-కంప్లైంట్ 312cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది. RR 310 లాగానే, RTR 310 కూడా ఒక్కో రైడింగ్ మోడ్‌కు వేర్వేరు ఇంజన్ ట్యూన్‌లతో అందుబాటులో ఉంది.
RR 310 లాగానే, రాబోయే TVS Apache RTR 310 కూడా బ్రాండ్ బిల్ట్ టు ఆర్డర్ (BTO) ప్రోగ్రామ్‌లో భాగం అవుతుంది.
TVS Apache RTR 310లో కూడా RR 310లో కనిపించే బెస్ట్-ఇన్-క్లాస్ మిచెలిన్ రోడ్ 5 టైర్‌లతో వస్తుంది.
ప్రీమియం టైర్లు మిడిల్ వెయిట్, లీటర్-క్లాస్ మోటార్‌సైకిళ్లకు ఉత్తమ ఆప్షన్స్ లో ఒకటి.
ఇవి మెరుగైన పనితీరుతో పాటు ఎక్కువ కాలం పనిచేస్తాయి.