
Royal Enfield: 750 సీసీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT-R.. లాంచ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో క్రూయిజర్ బైక్‌లకు మారుపేరు అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్, త్వరలోనే శక్తివంతమైన 750cc ఇంజిన్‌తో కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఎనిమిదేళ్లుగా ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 వంటి బైక్‌లతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో 650cc విభాగంలో తనదైన ముద్ర వేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు మరింత శక్తివంతమైన 750cc విభాగంలోకి అడుగుపెడుతోంది.
Details
పరీక్షల్లో పట్టుబడ్డ కొత్త GT-R 750
ఇటీవల భారత్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించిన బైక్ కాంటినెంటల్ GT-R 750గా గుర్తించారు. అదే 750cc ఇంజిన్‌ను ఇంటర్‌సెప్టర్‌లో కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. తొలి 750cc బైక్‌గా కాంటినెంటల్ GT-R విడుదల కానుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. లీకైన స్పై ఇమేజ్ ద్వారా బైక్ డిజైన్ కూడా బహిర్గతమైంది. ఇప్పటివరకు విడుదలైన బైక్‌లలో అత్యంత స్పోర్టీగా, అత్యంత శక్తివంతంగా ఈ బైక్‌ను పరిగణిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి కేఫ్ రేసర్ లుక్‌లో ఉండనుంది. వంపైన ఫుట్‌పెగ్‌లు, వంగిన రైడింగ్ పోజ్, రౌండ్ ఇండికేటర్లు, వెనుక భాగంలో క్రోమ్ ఫినిషింగ్ వంటి అంశాలు కనిపిస్తున్నాయి. టెస్టింగ్ పరికరాలు కూడా వెనుక భాగంలో దర్శనమిచ్చాయి.
Details
డిజైన్ ప్రత్యేకతలు
ఈ బైక్ కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో తొలిసారిగా దీనిలో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ళు ఉన్నాయి. వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్, క్రోమ్‌తో ట్విన్ ఎగ్జాస్ట్‌లు కూడా ఉన్నాయి. ఇవి GT 650 మాదిరిగానే ఉండేలా కనిపిస్తున్నాయి. అంతేగాక, ట్యూబ్‌లెస్ టైర్లు, నల్లటి అల్లాయ్ వీల్స్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్లను ఈ బైక్‌లో పొందుపర్చారు. ఇంజిన్ సామర్థ్యం ఇందులో 750cc ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 650cc ఇంజిన్ డిజైన్ ఆధారంగా ఉండేలా రూపొందించినా, శక్తిని మరింతగా పెంచేలా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 650cc ఇంజిన్ 46.3 bhp పవర్, 52.3 Nmటార్క్‌ను ఇస్తుండగా, 750cc ఇంజిన్ మరింత సామర్థ్యాన్ని అందించేలా ఉంటుందని అంచనా.
Details
ప్రదర్శన, లాంచ్ వివరాలు
ఈ బైక్‌ను నవంబర్‌లో ఇటలీలో జరగనున్న EICMA (2025) ద్విచక్ర వాహన ప్రదర్శనలో తొలిగా ఆవిష్కరించనున్నారు. భారతదేశంలో లాంచ్ మాత్రం 2026 తొలి ఆర్థంలో జరగనుంది. స్పోర్టీ స్టైల్, అధిక శక్తితో రాబోతున్న ఈ కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రూయిజర్ అభిమానులను మరోసారి అలరిస్తుందనే విషయం మాత్రం ఖాయం.