Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కొత్త స్క్రామ్ 440 విడుదల .. ధర, ఇతర వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తాజాగా స్క్రామ్ 440 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది.
గత ఏడాది మోటోవెర్స్ 2024లో దీనిని ఆవిష్కరించిన సంస్థ, ఇప్పుడు దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఈ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ట్రయల్ వేరియంట్ ధరను రూ. 2.08 లక్షలుగా నిర్ణయించగా, హైఎండ్ ఫోర్స్ వేరియంట్ ధర రూ. 2.15 లక్షలుగా నిర్ణయించింది.
వివరాలు
4000 ఆర్‌పీఎం వద్ద 34 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి
కొత్త స్క్రామ్ 440లో 443 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు.
ఇది 6250 ఆర్‌పీఎం వద్ద 25.4 బీహెచ్‌పీ శక్తిని, 4000 ఆర్‌పీఎం వద్ద 34 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అందించారు. ఈ బైక్ 19/17 అంగుళాల స్పోక్ వీల్స్‌తో పాటు ట్యూబ్ టైప్ టైర్స్‌తో వస్తుంది.
ఫోర్స్ వేరియంట్‌లో అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్ అందుబాటులో ఉన్నాయి.
ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. అలాగే ముందూ వెనుక డిస్కు బ్రేక్ సదుపాయాన్ని అందించారు.
వివరాలు
స్క్రామ్ 411ను పోలి
ఈ మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో విడుదల చేసిన స్క్రామ్ 411ను పోలి ఉంటుంది.
దీని ప్రత్యేకతల్లో రౌండ్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, పూర్తి డిజిటల్ అనలాగ్ క్లస్టర్ ఉన్నాయి.
ఈ మోటార్‌సైకిల్ ట్రెయిల్ గ్రీన్, ట్రెయిల్ బ్లూ, ఫోర్స్ గ్రే, ఫోర్స్ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
అదనంగా, స్విచెబుల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సదుపాయం కలిగి ఉంది.
ఈ మోటార్‌సైకిల్ ప్రధానంగా ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్, యెజ్డీ స్క్రాంబ్లర్ వంటి మోడల్స్‌కు గట్టి పోటీ అందించనుంది.