
Tata discounts: హారియర్ ఈవీపై రూ.1 లక్ష డిస్కౌంట్.. టాటా ఈవీలకు భారీ ఆఫర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై విశేష డిస్కౌంట్‌లు ప్రకటించింది. జూన్‌లో టాటా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం తగ్గిపోవడంతో అమ్మకాలను పెంచేందుకు ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టింది. జూన్‌లో టాటా 37,083 యూనిట్లు మాత్రమే విక్రయించగా, 2023 జూన్‌లో ఈ సంఖ్య 43,527గా ఉండింది.
Details
హారియర్ ఈవీపై రూ.1 లక్ష డిస్కౌంట్
కంపెనీ అత్యధికంగా హారియర్ ఈవీపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే, ఇది కేవలం ఎంపిక చేసిన వేరియంట్‌లు, కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమై ఉంది. అలాగే టాటా వాహన యజమానులకు లాయల్టీ ప్రయోజనాలు లభించనున్నాయి. టియాగో, పంచ్ ఈవీలకు ప్రత్యేక ఆఫర్లు టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ కొనుగోలుపై మొత్తం రూ.40 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, మరో రూ.20 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటాయి. ఇదే డీల్‌ను పంచ్ ఈవీపై కూడా అందిస్తోంది.
Details
నెక్సాన్, కర్వ్ ఈవీకి అదనపు బెనిఫిట్లు
భారీగా డిమాండ్ ఉన్న నెక్సాన్ ఈవీ కొనుగోలుపై రూ.30 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. అదనంగా 6 నెలలపాటు టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో వెయ్యి యూనిట్ల ఉచిత ఛార్జింగ్‌ను అందిస్తోంది. అలాగే, కొత్తగా ప్రవేశపెట్టిన కర్వ్ ఈవీపై రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నట్లు తెలిపింది. తొలివెయ్యి మంది కస్టమర్లకు కూడా 6 నెలల ఉచిత ఛార్జింగ్ సదుపాయం కల్పిస్తోంది.