LOADING...
 Hero Splendor Plus:రూ. 10వేలు డౌన్ పేమెంట్‌తో 80 కిలోమీటర్ల మైలేజీ!
రూ. 10వేలు డౌన్ పేమెంట్‌తో 80 కిలోమీటర్ల మైలేజీ!

 Hero Splendor Plus:రూ. 10వేలు డౌన్ పేమెంట్‌తో 80 కిలోమీటర్ల మైలేజీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరతో ఎక్కువ మైలేజీని ఇచ్చే బైకులను కోరుకుంటారు. అందుకే చాలా మంది హీరో స్ప్లెండర్ ప్లస్ పై ఆసక్తి చూపుతారు. పల్లెటూర్లోనూ, సిటీలోనూ ఇది సౌకర్యంగా ఉపయోగపడుతుంది. మీరు తక్కువ ధరలో మంచి మైలేజీ ఉన్న కొత్త బైక్ కొనాలని హీరో స్ప్లెండర్ ప్లస్ తీసుకోవచ్చు. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 76,306 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దిల్లీలో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 88,500గా ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే రూ. 10,000 డౌన్ పేమెంట్‌ చేసి, 9.7 శాతం వడ్డీతో 36 నెలల పాటు ప్రతి నెల రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది.

Details

ఫైనాన్స్ ప్లాన్ తో కొనాలంటే క్రెడిట్ స్కోర్ అవసరం

అయితే ఈ ఫైనాన్స్ ప్లాన్‌తో కొనాలంటే మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8.02 పీఎస్ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, లీటరుకు 80.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పూర్తి ట్యాంక్‌తో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ బైక్ 130 ఎంఎం డ్రమ్ యూనిట్‌తో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది హోండా షైన్ 100, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 వంటి బైకులతో పోటీపడుతుంది.