Page Loader
Hero Splendor Bike: రూ. 80 వేలకే హీరో స్ప్లెండర్ - అమ్మకాల్లో తిరుగులేని హీరో
రూ. 80 వేలకే హీరో స్ప్లెండర్ - అమ్మకాల్లో తిరుగులేని హీరో

Hero Splendor Bike: రూ. 80 వేలకే హీరో స్ప్లెండర్ - అమ్మకాల్లో తిరుగులేని హీరో

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో మోటోకార్ప్ అక్టోబర్ 2024లో దేశంలోనే నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీదారుగా గుర్తింపు పొందింది. ఈ పండుగ సీజన్‌లో హీరో తన బైక్‌లు, స్కూటర్లను విపరీతంగా విక్రయించింది. ముఖ్యంగా, హీరో స్ప్లెండర్ బైక్ సూపర్‌హిట్‌గా నిలిచి, అమ్మకాల్లో సత్తా చాటింది. అక్టోబర్ 2024లో హీరో 6,79,091 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, 2023లో ఈ సంఖ్య 5,74,930 యూనిట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన 18.12 శాతం వృద్ధిని సాధించడం విశేషం. సెప్టెంబర్ 2024లో 6,37,050 యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, అక్టోబర్‌లో 6.60 శాతం పెరుగుదల కనిపించింది. హీరో స్కూటర్ల కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లను విక్రయించగా, హోండా 5,97,711 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Details

లీటరుకు 80.6 కిమీ మైలేజీ

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 76,356 నుండి రూ. 77,496 వరకు ఉంది. ఇది లీటరుకు 80.6 కిమీ మైలేజీ ఇస్తుంది. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్ 97.2 సిసి ఇంజన్ తో రూ. 97,089 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 124.7 సిసి ఇంజన్ తో రూ. 83,350 నుండి రూ. 87,350 మధ్య ధరలో లభిస్తుంది. హీరో లైనప్‌లో స్ప్లెండర్ తో పాటు హెచ్ఎఫ్ డీలక్స్, మావెరిక్ 440, కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్, గ్లామర్ వంటి పాపులర్ బైక్‌లు ఉన్నాయి. స్కూటర్లలో ప్లెజర్ ప్లస్, జూమ్, డెస్టినీ 125 ఎక్స్‌టెక్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వంటి వేరియంట్లను విక్రయిస్తోంది.