రూ. 78,500 లకే స్టైలిష్ బైక్.. లాంచ్ చేసిన హోండా
హోండా మోటర్స్ లివో 2023 మోడల్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ డిస్క్ వేరియంట్, డ్రమ్ వేరియంట్ల రూపంలో లభించనుంది. డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.78,500 ఉండగా, డ్రమ్ వేరియంట్ ధర రూ.82,500 ఉండనుంది. లివో 2023 మోడల్‌లో ఓబీడీ 2 ప్రమాణాలకు అనుగుణంగా, డిజైన్లలో కూడా మార్పులు చేశారు. ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు చేయకపోవడం విశేషం. ఈ బైక్ 7500 ఆర్పీఎం వద్ద 8.67 బీహెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేయనుంది. అలాగే 5,500 ఆర్పీఎం వద్ద 9.30 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేయనుంది. ఈ బైకులో 110 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉండనుంది.
ఓబీడీ 2 ప్రమాణాలకు అనుగుణంగా లివో మోడల్ బైక్
ఈ బైకులో 4 స్పీడ్ గేర్ బాక్స్‌తో పాటు, ఇంజన్ కు స్టార్ట్-స్టాప్ సదుపాయం ఉంది. 2015లో లివో మోడల్ ను తీసుకొచ్చిన హోండా సంస్థ ఇప్పటికే పలుమార్లు టెక్నికల్ గా, డిజైన్ పరంగా అప్ గ్రేడ్ చేస్తూ వచ్చింది. ప్రధానంగా ఈ బైక్ ఇచ్చే మైలేజీ వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా ఓబీడీ 2 ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్ది మరోసారి మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ బైక్ స్టైల్, కంఫర్ట్, ఫర్మారెన్స్ పరంగా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోందని హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ యోగేశ్ మాథుర్ తెలిపారు.