Page Loader
రూఫ్(RUF) స్పోర్ట్స్ కార్లలో ట్రిబ్యూట్ మోడల్‌ 911.. ఇక పోర్స్చే 911కి ఫుల్ స్టాప్
రూఫ్ స్పోర్ట్స్ కార్లలో ట్రిబ్యూట్ మోడల్‌ 911..పోర్స్చే 911కి ఇక ఫుల్ స్టాప్

రూఫ్(RUF) స్పోర్ట్స్ కార్లలో ట్రిబ్యూట్ మోడల్‌ 911.. ఇక పోర్స్చే 911కి ఫుల్ స్టాప్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 21, 2023
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీలోని బవేరియాకు చెందిన ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ల తయారీ (ఆటోమోబైల్) సంస్థ రూఫ్(RUF) పోర్స్చే- 911కి ప్రత్యామ్నాయ మోడల్ ను రూపొందించింది. ఈ మేరకు వన్ ఆఫ్ ట్రిబ్యూట్ మోడల్‌ను రెడీ చేసింది. అలోయిస్ రూఫ్(RUF) జూనియర్ రూపొందించిన ఈ అల్ట్రా రేర్ హ్యాండ్ బిల్ట్ స్పోర్ట్స్ మోడల్ కారును కార్బన్ ఫైబర్ ఛాసిస్, బాడీ ప్యానెళ్లతో సిద్ధం చేశారు. ప్రత్యేకమైన నాలుగు చక్రాల వాహనాన్ని సవరించిన 3.6 లీటర్ ఇంజిన్, ఎయిర్-కూల్డ్, ఫ్లాట్-సిక్స్ ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది. దీని ఇంజిన్ 550 హార్స్ పవర్ ను(HP) విడుదల చేస్తుంది.

DETAILS

60వ వార్షికోత్సవం సందర్భంగా వన్ ఆఫ్ ట్రిబ్యూట్‌ మోడల్ రిలీజ్

1939లో అలోయిస్ రూఫ్ సీనియర్ ఆధ్వర్యంలో పోర్స్చే హై ఎండ్ మోడల్ రూపుదిద్దుకుంది. అంతే వేగంగా రూఫ్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ కార్లు ఇంజినీరింగ్ నైపుణ్యం, ప్రామాణికతకు గుర్తింపు సాధించింది. సంస్థలో తయారైన ప్రముఖ మోడల్ పోర్స్చే 911, 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ట్రిబ్యూట్ మోడల్ ను రిలీజ్ చేసింది. ఇందులో కార్బన్ ఫైబర్, అల్యూమినియం వంటి ప్రీమియం మెటీరియల్స్ ల వినియోగంతో తయారు చేసింది. అయితే పోర్స్చే స్పోర్ట్స్ కారు అసలు డిజైన్‌ రూపంలో మార్పులు చేర్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఫలితంగా RUF ట్రిబ్యూట్ 911ని మాతృ మోడల్ డిజైన్ ను కొనసాగించడం విశేషం.

DETAILS

RUF ట్రిబ్యూట్ 911 మోడల్, 2 సీటర్ క్యాబిన్ కలిగి ఉంటంది. 

1960 దశకం నుంచి తయారీలో ఉన్న ఐకానిక్ పోర్స్చే 911 డిజైన్‌కు ఏమాత్రం తీసిపోకుండా ట్రిబ్యూట్ మోడల్ వచ్చేస్తోంది. డిఆర్‌ఎల్‌లతో కూడిన ఓవల్ ఆకారపు హెడ్‌లైట్లు, రేక్డ్ విండ్‌ స్క్రీన్, విశాలమైన ఎయిర్ డ్యామ్, వాలుగా ఉండే రూఫ్‌లైన్, డిజైనర్ వీల్స్ లను కలిగి ఉంది. కారు వెనుక టెయిల్‌ లైట్లను కనెక్ట్ చేశారు. పెద్ద బూట్ మౌంటెడ్ స్పాయిలర్‌ని సైతం పొందుపర్చారు. దీని ఛాసిస్ పూర్తిగా కార్బన్ ఫైబర్ తో తయారైంది. RUF ట్రిబ్యూట్ 911 మోడల్, 2 సీటర్ క్యాబిన్ కలిగి ఉంటంది. ఇది బకెట్-రకం సీట్లు, ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, అనలాగ్ డయల్స్,గేజ్‌లు, మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ సహా మాన్యువల్ ACని కలిగి ఉంటుందని పేర్కొంది.