LOADING...
CT-2 Electric Car : ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ప్లాన్..సరికొత్త మోడల్ కార్
ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ప్లాన్..సరికొత్త మోడల్ కార్

CT-2 Electric Car : ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ప్లాన్..సరికొత్త మోడల్ కార్

వ్రాసిన వారు Moogati Shabari
May 21, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని రద్దీ నగరాల్లో ఈ-రిక్షాలకు ప్రత్యామ్నాయంగా మారే సామర్థ్యం ఉన్న భవిష్యత్ అర్బన్ మొలిటీ సొల్యూషన్‌గా సిటీ ట్రాన్స్‌ఫార్మర్ CT-2 ఎలక్ట్రిక్ కార్‌ను పరిచయం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు కారుకు ఉండే సౌకర్యం, భద్రతను అందించేలా ఈ వాహనాన్ని రూపొందించినట్లు సిటీ ట్రాన్స్‌ఫార్మర్ సీఈఓ డాక్టర్ ఆసఫ్ ఫోర్మోజా తెలిపారు. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు ఇది మంచి పరిష్కారంగా మారొచ్చని చెప్పారు.

వివరాలు

భారత మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే?

డాక్టర్ ఆసఫ్ ఫోర్మోజా వివరాల ప్రకారం, సిటీ ట్రాన్స్‌ఫార్మర్ CT-2 ప్రపంచంలోనే వెడల్పును కేవలం ఒక మీటర్ వరకు తగ్గించుకోగల తొలి వాహనం. సాధారణంగా చిన్న కార్లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాయని, కానీ CT-2 తన పరిమాణాన్ని తగ్గించుకుని ఇరుకైన రోడ్లలో కూడా సులభంగా ప్రయాణించగలదని తెలిపారు. ఈ వాహనం ప్రీమియం వ్యక్తిగత వాహనంగా, షేర్డ్ మొిలిటీ సొల్యూషన్‌గా, అలాగే భారతదేశం వంటి మార్కెట్లలో ఈ-రిక్షాలకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భారత మార్కెట్‌ను కంపెనీ భవిష్యత్ కీలక మార్కెట్లలో ఒకటిగా చూస్తోందని వెల్లడించారు.

వివరాలు

ఆ కంపెనీలతో చర్చలు..

ఇప్పటికే భారతదేశంలోని పలు ప్రముఖ సంస్థలతో కంపెనీ చర్చలు జరుపుతోందని డాక్టర్ ఆసఫ్ తెలిపారు. అంతేకాకుండా, CT-2 ఎలక్ట్రిక్ కారును భారత్‌లో తయారు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాంపాక్ట్ డిజైన్, ఫ్లెక్సిబుల్ నిర్మాణం కారణంగా ఈ వాహనం భారతీయ మార్కెట్‌కే కాకుండా ప్రపంచ మార్కెట్లకు కూడా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. యూరప్‌లో అమల్లో ఉన్న L7E వాహన నిబంధనల కింద సిటీ ట్రాన్స్‌ఫార్మర్ CT-2కు ఇప్పటికే అనుమతి లభించిందని సీఈఓ తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ వాహనానికి జర్మన్ లైసెన్స్ ప్లేట్ కూడా ఉన్నదని, యూరప్ అంతటా చట్టబద్ధంగా నడపడానికి అనుమతి ఉందని చెప్పారు.

Advertisement

వివరాలు

వాహనం ప్రత్యేకతలు ఇవే..

సిటీ ట్రాన్స్‌ఫార్మర్ CT-2లో అత్యంత ప్రత్యేకత దాని మార్పు చెందగల బాడీ డిజైన్. సాధారణ మోడ్‌లో ఉన్నప్పుడు ఈ వాహనం గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. వెడల్పును ఒక మీటర్‌కు తగ్గించిన తర్వాత కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ సమయంలో ఇది మోటార్‌సైకిల్‌కు అవసరమయ్యేంతే రోడ్, పార్కింగ్ స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. "కారులా డ్రైవ్ చేయొచ్చు.. మోటార్‌సైకిల్‌లా పార్క్ చేయొచ్చు" అని డాక్టర్ ఆసఫ్ పేర్కొన్నారు. సిటీ ట్రాన్స్‌ఫార్మర్ CT-2 పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. దీనిలో వెనుక చక్రాలపై అమర్చిన రెండు ఇన్-వీల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి.

Advertisement

వివరాలు

అదిరిపోయే ఫీచర్లు..

ఇందులో 15 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే సుమారు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పటికీ ఈ వాహనం బరువు 600 కిలోల కంటే తక్కువగా ఉండటం మరో ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ప్రయాణం గురించి మాట్లాడుతూ, 2014లోనే ఈ కాన్సెప్ట్‌పై పని ప్రారంభించామని డాక్టర్ ఆసఫ్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి దాదాపు 5 వేల ప్రీ-ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. వీటిలో ఎక్కువగా జర్మనీ, యూరప్‌లోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ నుంచి వచ్చినవేనని వెల్లడించారు. ఇప్పుడు సీరియల్ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు కంపెనీ నిధుల సమీకరణలో ఉందని చెప్పారు.

Advertisement