Tata Motors Offer: టాటా కార్లకు సూపర్ డీల్.. రూ.1.75 లక్షల వరకూ రికార్డు స్థాయిలో తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
కారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. టాటా మోటార్స్ నవంబర్ 2025 నెలలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త 'సియెరా' లాంచ్‌కి ముందుగా హారియర్, సఫారీ, కర్వ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్ వంటి ప్రముఖ మోడళ్లపై ఏకంగా రూ. 1.75 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు రూపంలో వర్తిస్తాయి. హారియర్, సఫారీ : మిడ్-స్పెక్ 'అడ్వెంచర్' వేరియంట్లపై అత్యధికంగా రూ. 1.75 లక్షల వరకు తగ్గించారు.
Details
ప్రధాన డిస్కౌంట్లు
ఎంట్రీ లెవల్ 'స్మార్ట్' మోడళ్లపై రూ. 50,000తగ్గింపు. 'ప్యూర్' వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్. ఆల్ట్రోజ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడళ్లపై రూ. 1లక్ష, 'రేసర్' వేరియంట్‌పై రూ. 1.35లక్షల వరకు ఆఫర్. నెక్సాన్ : రూ. 45,000 వరకు బెనిఫిట్స్ + 2025 మోడళ్లకు అదనంగా రూ. 20,000 లాయల్టీ బోనస్. కర్వ్ : 2024 మోడళ్లపై రూ. 30,000, 2025 మోడళ్లపై రూ. 40,000 వరకు తగ్గింపు. పంచ్ 2025 :రూ. 40,000 వరకు డిస్కౌంట్. టియాగో :రూ. 25,000 నుంచి 40,000 వరకు తగ్గింపు. టిగోర్ :రూ. 30,000 నుంచి 45,000 వరకు ఆఫర్లు. టాటా మోటార్స్ స్పష్టంగా తెలిపింది, ఈ ఆఫర్లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత ఆధారంగా మారవచ్చు.