Page Loader
Tata Curvv Dark Edition: టాటా నుంచి కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్..
టాటా నుంచి కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్..

Tata Curvv Dark Edition: టాటా నుంచి కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ కార్ తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన కూపే ఎస్‌యూవీ అయిన కర్వ్‌కి డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడళ్లకు డార్క్ ఎడిషన్ అందుబాటులో ఉన్నా, తాజాగా కర్వ్ మోడల్‌ కూడా ఈ ప్రత్యేక ఎడిషన్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త డార్క్ ఎడిషన్ కర్వ్ ''బ్లాక్ బ్యూటీ''గా తనదైన ఆకర్షణను కలిగి ఉండి, మరింత స్టైలిష్ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. నెక్సాన్‌తో పోలిస్తే ఇందులో మరిన్ని ఆధునిక ఫీచర్లు అందించబడ్డాయి. అంతేగాక, ఇంటీరియర్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉండడం గమనార్హం. కర్వ్ డార్క్ ఎడిషన్ కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

వివరాలు 

టాటా కర్వ్ డార్క్ ఎడిషన్: వేరియంట్లు,ధర వివరాలు 

ఈ ఎస్‌యూవీ రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. అవి అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ +A.ఈ రెండు ట్రిమ్‌లలోనూ టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ వేరియంట్లు ఉంటాయి. 1.2 లీటర్ల హైపెరియన్ GDi పెట్రోల్ వేరియంట్‌ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధర రూ.16.49 లక్షలుగా ప్రారంభమవుతుంది. అదే పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తే ధర రూ.19.47 లక్షల వరకు ఉంటుంది. ఇక 1.5 లీటర్ల క్రయోజెట్ డీజిల్ వేరియంట్‌ విషయానికొస్తే, వేరియంట్ ట్రిమ్,ట్రాన్స్మిషన్ ఆధారంగా దీని ధర రూ. 17.99 లక్షల నుంచి రూ. 19.52 లక్షల మధ్య ఉంటుంది. ఈ మోడల్ సిట్రొయెన్ బసాల్ట్‌కు గట్టి పోటీగా నిలుస్తుంది. GDi పెట్రోల్ ఇంజన్ 125 హెచ్‌పీ పవర్, 225 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వివరాలు 

ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ థీమ్‌లో..

డీజిల్ వేరియంట్‌ 118 హెచ్‌పీ పవర్‌తో పాటు 260 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం ఫెర్ఫార్మెన్స్‌నే కాకుండా, ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా చాలా రిఫైన్డ్‌గా, ప్రీమియంగా రూపుదిద్దుకుంది. ఇందులో పియానో బ్లాక్ ఇన్సర్ట్స్‌తో కూడిన క్రోమ్ ఎలిమెంట్స్ వాడటం వల్ల కార్‌కి ప్రత్యేక ఆకర్షణ వచ్చిందని చెప్పవచ్చు. ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ థీమ్‌లో డిజైన్ చేయబడింది. ఇందులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌షేడ్ వంటి అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయి.