Tata Curvv : టాటా కర్వ్ మోడల్'లో కీలకమైన భద్రతా ఫీచర్.. భారతదేశంలో లాంచ్'కు ముందే..
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ నుంచి విడుదల కానున్న SUV, Curvv, మోడల్' మరింత ఆధునీకరణ చెందనుంది. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కెమెరా మాడ్యూల్‌తో పరీక్షించబడుతోంది.
అయితే మాడిఫై చేసిన టాటా హారియర్, టాటా సఫారి లాంటి మోడళ్లలో ఉన్నట్టే Curvvలోనూ కీలకమైన భద్రతా ఫీచర్ రానుంది. ఈ క్రమంలోనే కర్వ్ మోడల్' విశేషాలు లాంచ్'కు ముందే లీక్ అయ్యాయి.
Curvvలోని ADAS సూట్ బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, హై బీమ్ అసిస్ట్,ేఅడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్,ఫ్రంట్,రియర్ ఢీకొనే హెచ్చరిక,అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను అందించనుంది.
Curvv ఇంటీరియర్స్ :
ఇదే సమయంలో Curvv లోపల,మీరు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,డ్రైవర్ డిస్‌ప్లే కోసం డ్యూయల్-స్క్రీన్ సెటప్‌తో కూడిన డిజైన్‌తో రూపొందిస్తున్నారు.
Details
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా లక్షణం ఉండే అవకాశం
ADAS ప్యాకేజీతో పాటు, వాహనం ABS, EBD, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
Curvv EV వెలుపలి భాగం వాలుగా ఉండే రూఫ్‌లైన్ సహా కనెక్ట్ చేయబడిన LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌లైట్‌లతో స్పోర్టీ రూపాన్ని కలిగి ఉంటుంది.
టాటా Curvv ఇంజిన్ వేరియంట్ 123.2hp, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను సిద్ధం చేస్తున్నారు. ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఇంకా ప్రకటించబడనప్పటికీ,ేఅవి నెక్సాన్ (ఫేస్‌లిఫ్ట్)లో ఉన్న 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ మాదిరిని కలిగి ఉండవచ్చు.
టాటా Curvv EV వెర్షన్ ధర సుమారుగా రూ. 20 లక్షలుగా ఉంది.ICE-ఆధారిత Curvv ధర రూ.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది.