Page Loader
Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV!
జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV!

Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనం హారియర్ ఈవీ జూన్ 3న అధికారికంగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఇది కంపెనీ నుంచి వస్తున్న తొలి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇప్పటికే టాటా మోటార్స్ పలు సందర్భాల్లో ఈ హారియర్ ఈవీని ప్రదర్శించింది. ఇటీవలే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఉత్పత్తి సిద్ధంగా ఉన్న మోడల్‌ను చూపించారు. ఈ ఎలక్ట్రిక్ SUVకు సంబంధించి టాటా మోటార్స్ ఇప్పటి వరకు స్పెసిఫికేషన్లను అధికారికంగా ప్రకటించలేదు. అయినా ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది సుమారు 500 కిలోమీటర్ల పరిధిని అందించగలదని ఇండస్ట్రీ వర్గాల అంచనాలు. ఇది టాటా నుంచి కొత్త తరం వాహనాల్లో మొట్టమొదటిది కానుంది.

Details

వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లైట్లు

రెండు మోటార్ల అమరికతో 4WD డ్రైవ్‌ట్రైన్ (నాలుగు చక్రాలకు శక్తినివ్వే వ్యవస్థ) ఇందులో లభించనుంది. ఒక్కో మోటార్ ఒక్కో యాక్సిల్‌కు శక్తినివ్వనుంది. డిజైన్ పరంగా, టాటా హారియర్ ఈవీ ఎక్స్‌టీరియర్ గమనిస్తే, 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్ డిజైన్ శైలినే కొనసాగించే అవకాశం ఉంది. డీజిల్ హారియర్ ఫేస్‌లిఫ్ట్‌కు సమానంగా ఉండే ఈ డిజైన్‌లో నిలువుగా అమర్చిన LED హెడ్‌లైట్లు, బ్లేడ్ ఆకారంలోని DRLs, వీటిని కలిపే ఫుల్-విడ్త్ లైట్ బార్, దృఢమైన వీల్ ఆర్చ్‌లు, పైకి లేచే విండో లైన్, బ్లాక్‌డ్-అవుట్ D-పిల్లర్‌తో తేలియాడే రూఫ్ డిజైన్ లాంటి అంశాలు ఉంటాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లైట్లు, బంపర్ పై నిలువు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లు కనిపించనున్నాయి.

Details

టాప్-ఎండ్ వెర్షన్‌లో లభించే అవకాశం

ఫీచర్ల పరంగా, టాటా నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వాహనాల్లో ఉన్న 'V2L (Vehicle-to-Load), V2X (Vehicle-to-Everything)' ఫీచర్లను ఇందులోనూ చూడవచ్చు. ఈ ఫీచర్లతో వాహనం నుండి ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలకు విద్యుత్ సరఫరా చేయడం సాధ్యమవుతుంది. సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ కూడా టాప్-ఎండ్ వెర్షన్‌లో లభించే అవకాశం ఉంది. అలాగే, హారియర్ ఈవీ 'లెవల్ 2 ADAS సిస్టమ్'తో కూడా రావొచ్చని అంచనాలున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో గట్టి పట్టు ఉంది.

Details

రూ.24 లక్షల నుండి ప్రారంభం

తియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడల్స్ మార్కెట్‌లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. హారియర్ ఈవీతో తమ ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. ధర పరంగా చూస్తే, టాటా హారియర్ ఈవీ రూ.24 లక్షల నుండి రూ.30 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, కియా కారెన్స్ ఈవీ, MG ZS ఈవీ, మారుతి సుజుకి ఇ-విటారా వంటి వాహనాలకు పోటిగా నిలవనుంది,