Page Loader
Tata Harrier: పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రూపాల్లో టాటా హారియర్‌ కారు
Tata Harrier: పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రూపాల్లో టాటా హారియర్‌ కారు

Tata Harrier: పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రూపాల్లో టాటా హారియర్‌ కారు

వ్రాసిన వారు Stalin
May 19, 2024
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సేఫ్టీలో టాటా మోటార్స్ ని ఢీ కొట్టే కార్లు లేవు. ఆ సంస్థ నుంచి టాటా హారియర్‌, సఫారీ, నెక్సాన్‌ కార్లు ది బెస్ట్‌ ట్రస్టెడ్ కార్లుగా ఉన్నాయి. సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో టాటా మోటార్స్ భారతదేశంలో నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా పేరుగాంచాయి. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న హారియర్‌ దేశంలోనే అత్యంత సేఫ్టీ కారుగా ఉంది. ప్రస్తుతం టాటా హారియర్‌ కారు కేవలం డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని రకాల కస్టమర్లను సంతృప్తి పరిచేందుకు ఈ కారుని పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రూపాల్లో విడుదల చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

Details 

ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌

2025లో ఈ కారును పెట్రోల్-ఎలక్ట్రిక్ రూపంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఈ కారు డ్యూయల్ మోటార్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని చెబుతున్నారు. హారియర్ EVలోనూ డీజిల్ పవర్‌ట్రెయిన్ మోడల్‌తో సరి సమానమైన ఫీచర్లను జోడించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులతో వచ్చే ఈ కారు మార్కెట్‌ని పూర్తిగా శాసించే అవకాశం ఉంది.