Page Loader
టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్.. త్వరలోనే ఈవీ, ఐసీఈ లాంచ్!
టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్

టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్.. త్వరలోనే ఈవీ, ఐసీఈ లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2023
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటర్స్ కు ప్రపంచ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సియుఆర్ వివి లాంచ్ చేయడానికి సిద్ధమైంది. మునపటి లాంచ్ ఫార్మాట్‌ల మాదిరి కాకుండా ముందుగా ఈవీని లాంచ్ చేయడానికి సన్మాహాలను చేస్తోంది. తర్వాతి కొన్ని నెలల్లోనే ఈసీఈ లాంచ్‌కు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. CURVV EV కంటే ICE ఎక్కువ ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధర వ్యత్యాసం ఉన్నప్పటికీ రెండు వెర్షన్లు స్థిరమైన డిజైన్, నాణ్యత, ప్రత్యేకమైన ఫీచర్లు ఉండనున్నాయి. రెండు మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం ఉన్నప్పటికీ Nexon డెరివేటివ్‌ల మాదిరిగానే ఉండనుంది.

Details

Nexon EV ప్రైమ్ ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు

ఎంట్రీ లెవల్ పెట్రోల్ MT ధర కేవలం రూ. 8 లక్షలు ఉండగా, Nexon EV ప్రైమ్ ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు ఉండనుంది. సహజంగానే ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే ఈవీ డెరివేట్ చాలా ఖరీదైనది. అయితే సీయుఆర్‌వివి ఈవికి ప్రత్యేకమైన ఫీచర్లు ఉండడం విశేషం. ఈ రెండు మోడల్స్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. ఈవీ డెరిటేవ్ Q1 Fy24 రూపంలో ముందుకొస్తోంది. తర్వాత కొన్ని నెలలోనే ఐసీఈ వెర్షన్ రాబోతోంది.