LOADING...
Tata Motors: టాటా మోటార్స్ సెన్సేషనల్ డిసిషన్.. కార్ల ధరలు గరిష్టంగా రూ.1.45 లక్షలు తగ్గింపు! 
టాటా మోటార్స్ సెన్సేషనల్ డిసిషన్.. కార్ల ధరలు గరిష్టంగా రూ.1.45 లక్షలు తగ్గింపు!

Tata Motors: టాటా మోటార్స్ సెన్సేషనల్ డిసిషన్.. కార్ల ధరలు గరిష్టంగా రూ.1.45 లక్షలు తగ్గింపు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఇటీవల చిన్న కార్లపై జీఎస్టీని కేంద్రం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుందని జీఎస్టీ మండలి ప్రకటించింది. దీంతో కార్ల ధరలు తగ్గే అవకాశముందని వినియోగదారులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ తగ్గింపును నిజంగా కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేస్తాయా లేదా అన్న ప్రశ్నల మధ్య, కొన్ని సంస్థలు ఇప్పటికే స్పష్టతనిచ్చాయి. ముందుగా ఎఫ్‌ఎంసీజీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది.

Details

 కార్లు ధరలు తగ్గనున్నాయి

అలాగే పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కూడా జీఎస్టీ తగ్గింపుతో రిటైల్ వినియోగం పెరిగి, దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంటూ, వినియోగదారులకు లాభాలు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో టాటా మోటార్స్ కూడా ముందుకొచ్చింది. జీఎస్టీ తగ్గింపుతో వచ్చే ప్రయోజనాలను ఎలాంటి కోత లేకుండా కస్టమర్లకు అందిస్తామని, అందువల్ల కార్ల ధరలు నేరుగా తగ్గనున్నాయని కంపెనీ స్పష్టం చేసింది.

Details

కొత్త కస్టమర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలను గౌరవిస్తూ, వినియోగదారులకు పూర్తి స్థాయిలో లాభాలను బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాం. దీంతో మా వాహనాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. కొత్త కస్టమర్లకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, టాటా ప్యాసింజర్ వాహనాల ధరలను కనీసం రూ. 75 వేల నుంచి గరిష్టంగా రూ. 1.45 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Details

మోడల్‌-వారీగా ధర తగ్గింపు వివరాలు

టాటా టియాగో (Tiago) - రూ. 75 వేల తగ్గింపు టాటా టిగోర్ (Tigor) - రూ. 80 వేల తగ్గింపు టాటా ఆల్ట్రోజ్ (Altroz) - రూ. 1.10 లక్షల తగ్గింపు టాటా పంచ్ (Punch) - రూ. 85 వేల తగ్గింపు టాటా నెక్సాన్ (Nexon) - రూ. 1.55 లక్షల తగ్గింపు టాటా కర్వ్ (Curvv) - రూ. 65 వేల తగ్గింపు టాటా హ్యారియర్ (Harrier) - రూ. 1.40 లక్షల తగ్గింపు టాటా సఫారీ (Safari) - అత్యధికంగా రూ. 1.45 లక్షల తగ్గింపు ఈ నిర్ణయంతో టాటా మోటార్స్ వాహనాలు మరింత చౌకగా లభించనున్నాయి. వినియోగదారులకు ఇది పెద్ద ఊరట కలిగించే పరిణామంగా మారింది.