LOADING...
Tata Motors: జులై నుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు పెంపు..
జులై నుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు పెంపు..

Tata Motors: జులై నుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు పెంపు..

వ్రాసిన వారు Moogati Shabari
Jun 18, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ట్రక్కులు, బస్సులు సహా కమర్షియల్ వాహనాల విభాగానికి చెందిన మోడళ్లపై గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరలను సవరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరగడం, తయారీతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు అధికమవుతున్న నేపథ్యంలో ఆర్థిక భారం కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. అయితే అన్ని వాహనాలపై ఒకే శాతం పెంపు ఉండదని, ఆయా మోడళ్లు, వేరియంట్లను బట్టి ధరల మార్పు ఉంటుందని స్పష్టం చేసింది.

వివరాలు

ఎంత మేరకు పెరగొచ్చంటే?

ఇదే నెలలో టాటా మోటార్స్ తమ ప్రయాణికుల వాహనాల ధరలను కూడా పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంచనున్నట్లు పేర్కొంది. ఈ సవరణ కూడా వచ్చే నెల నుంచే అమల్లోకి రానుంది. ఇటీవలి కాలంలో ముడి పదార్థాల వ్యయం, ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరగడంతో పలువురు వాహన తయారీ సంస్థలు ధరలను సవరించాయి. గత నెలలో హ్యుందాయ్ తమ వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.12,800 వరకు పెంచగా, మారుతి సుజుకి కూడా ఈ ఏడాది ఆరంభంలోనే పలు మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.

Advertisement