NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / యూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్
    తదుపరి వార్తా కథనం
    యూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్
    యూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్

    యూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 19, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాటా మోటర్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ లోవర్ యూకేలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్లాంట్ ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    నైరుతి ఇంగ్లండ్‌లోని సోమర్‌సెట్‌లో కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ప్లాంట్ కోసం అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో సబ్సీడీలను ఇవ్వనున్నట్లు సమాచారం.

    ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీ సామర్థ్యాన్ని స్థానికంగా నిర్మించడానికి ప్రపంచ రేసులో చేరేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటన్‌కు ఈ ప్లాంట్ వల్ల భారీ ప్రయోజనం చేకూరనుంది.

    ఆ ప్రాంతంలో బ్యాటరీలపై ఆధారపడే వాహన తయారీదారులకు ఈ ప్లాంట్ వల్ల బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

    Details

    దాదాపుగా 9వేల కొత్త ఉద్యోగాలు

    ఈ పరిశ్రమ వల్ల సోమర్‌సెట్‌లో దాదాపుగా 9వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

    UKలో బ్యాటరీ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టడానికి JLR తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించిందని, దీంతో ఆ పరిశ్రమ కోసం అవసరమైన సబ్సిడీ ప్యాకేజీని అందిస్తామని పార్లమెంట్ వ్యాపార కమిటీ ఛైర్మన్ డారెన్ జోన్స్ అన్నారు.

    2030 లోగా పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను తగ్గించాలని, అందుకే ఎలక్ట్రికల్ వాహనాల ప్రోత్సహించడానికి బ్రిటన్ కృషి చేస్తోందన్నారు.

    ఈ పరిశ్రమ కోసం సోమర్‌సెట్‌ ను ఎంపిక చేయడం బ్రిటీష్ ప్రభుత్వం సాధించిన విజయంగా భావిస్తామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా
    ఎలక్ట్రిక్ వాహనాలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టాటా

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ఆటో మొబైల్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో

    ఎలక్ట్రిక్ వాహనాలు

    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్ ఆటో మొబైల్
    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు బి ఎం డబ్ల్యూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025