Page Loader
Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?
టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?

Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవలే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్కరించిన ఆ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ మోడల్ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే రూ. 21 వేలు చెల్లించి బుకింగ్స్ చేసుకోవచ్చు. క్రియేటివ్+ వేరియంట్‌లో ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, 16-అంగుళాల స్టీల్ వీల్స్, సిల్వర్‌డ్ రూఫ్ రైల్స్ రానున్నాయి. లోపల భాగంలో బ్యాక్‌లిట్ లోగో, ప్యాడిల్ షిఫ్టర్‌లు, 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్-వ్యూ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తోంది. ఈ ఈవీ 325 కి.మీ ప్రయాణించగలదని సంస్థ స్పష్టం చేసింది.

Details

టెక్సాన్ ఈవీలో అధునాతన ఫీచర్స్

న్యూ నెక్సాన్ ఈవీ కారు మీడియం రేంజ్ వర్షన్ (ఎంఆర్), సూదూరు శ్రేణి (ఎల్ఆర్) వర్షన్ బ్రాండ్లలో అందుబాటులో వస్తోంది. ఎంఆర్ వేరియంట్ లో 30 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్, ఎఆర్ వేరియంట్ 40.5 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ తో రానుంది. ఎఆర్ వేరియంట్ 465 కిలోమీటర్లు ప్రయాణించగదు. ఫియర్‌లెస్ ట్రిమ్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సీక్వెన్షియల్ LED DRL, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫాగ్ లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ కారు ఫాస్ట్ చార్జర్ సాయంతో 52 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది