TATA Punch EV : టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు.. అడాస్ ఫీచర్లతో రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
గత నెలలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్, ఇప్పుడు అదే మోడల్‌కు చెందిన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా అప్డేట్ చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టాటా పంచ్ ఈవీ ఇప్పటికే జనవరి 2024 నుంచి భారత మార్కెట్లో విక్రయాల్లో ఉంది. తాజాగా రానున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్ పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినా, గత నెలలో అప్‌డేట్ అయిన ఐసీఈ(పెట్రోల్)వేరియంట్‌ను పోలి ఉండే డిజైన్, ఫీచర్లతో ఇది రానుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో 2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ఇప్పటివరకు తెలిసిన వివరాలను ఒకసారి చూద్దాం.
Details
2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. డిజైన్ మార్పులు
ఫేస్‌లిఫ్ట్ ఐసీఈ పంచ్ మోడల్ తరహాలోనే ఈ ఈవీ వేరియంట్‌లో కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs), ముందు భాగంలో ఛార్జింగ్ లిడ్, అలాగే ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన కొత్త అలాయ్ వీల్స్ కొనసాగనున్నాయి. అయితే తాజా అప్‌డేట్‌తో ఐసీఈ మోడల్‌లో వచ్చినట్లే, ఈవీ వేరియంట్‌లో కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక పెట్రోల్ పంచ్‌లో అడాస్ (ADAS) ఫీచర్లు లేకపోయినా, ఫ్రంట్ బంపర్‌లో రాడార్ ఆధారిత సెన్సార్ హౌసింగ్‌ను పోలిన డిజైన్ ఎలిమెంట్ ఉంది. దీనిని బట్టి చూస్తే, పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ప్యాకేజీ ఇవ్వొచ్చని ఆటో వర్గాలు భావిస్తున్నాయి.
Details
ఇంటీరియర్‌లో కొత్త టచ్
ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే టాటా మోటార్స్, నెక్సాన్ ఈవీ నుంచి తీసుకున్న 12.3 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో అందించే అవకాశముంది. అదే విధంగా ఇప్పటికే ఉన్న 10.25 ఇంచుల డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM), యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు యథాతథంగా కొనసాగనున్నాయి.
Details
బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ వివరాలు
టాటా మోటార్స్ ఇప్పటివరకు పవర్‌ట్రెయిన్‌పై అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఉన్న బ్యాటరీ, మోటార్ ఆప్షన్లనే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా కొనసాగించే అవకాశముంది. 25 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్: ఇది ఒకసారి పూర్తి ఛార్జ్‌తో సుమారు 265 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి 82 హెచ్‌పీ పవర్, 114 ఎన్‌ఎం టార్క్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ జతగా ఉంటుంది. 35 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్: ఇది సుమారు 365 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనితో 122 హెచ్‌పీ పవర్, 190 ఎన్‌ఎం టార్క్ కలిగిన మోటార్ ఉంటుంది.
Details
ధర అంచనా
2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ ధరలైన రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల మధ్య ధరల కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా, డిజైన్ అప్‌డేట్స్, కొత్త ఫీచర్లతో పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మరింత ఆకర్షణీయంగా మారనుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.