LOADING...
Best family SUV : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రివీల్.. బెస్ట్ సెల్లింగ్ SUVకి న్యూ లుక్!
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రివీల్.. బెస్ట్ సెల్లింగ్ SUVకి న్యూ లుక్!

Best family SUV : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రివీల్.. బెస్ట్ సెల్లింగ్ SUVకి న్యూ లుక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ ఒకటి. 2021 అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్‌కు ఇదే మొదటి మిడ్-లైఫ్ అప్‌డేట్. టాటా మోటార్స్ ప్రస్తుతం పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ 2025లో టెస్ట్ మోడల్ కెమెరాలకు చిక్కగా, తాజాగా మరోసారి రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. టెస్ట్ కారు పూర్తిగా కవర్ చేసినప్పటికీ, డిజైన్, ఫీచర్లపై కొన్ని కీలక వివరాలు బయటపడ్డాయి.

Details

 డిజైన్, ఎక్స్‌టీరియర్ మార్పులు

కొత్త స్పై షాట్స్ ప్రకారం, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దాని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన 'పంచ్ EV' తరహాలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లేయర్డ్ డిజైన్‌కి బదులుగా ఫ్లాట్ టెయిల్‌గేట్ ప్రొఫైల్ కనిపిస్తోంది. అలాగే, ఇటీవల విడుదలైన 'ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లాగే కనెక్టెడ్ టెయిల్‌లైట్ సెటప్' ఉండబోతుంది. అదనంగా కొత్త ఫీచర్లు వెనుక వైపర్ వాషర్ రూఫ్ రైల్స్ షార్క్-ఫిన్ యాంటెన్నా కొత్త బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ వెనుక డోర్ హ్యాండిల్స్‌ను సి-పిల్లర్స్‌లో అమరిక

Details

ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు

లోపలి డిజైన్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ లభించనుంది. అదనంగా: ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ సెంట్రల్ కన్సోల్‌లో కప్ హోల్డర్స్ బ్లైండ్ స్పాట్ మానిటర్ ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి రావచ్చని అంచనా.

Details

ఇంజిన్, ధర వివరాలు

ఇంజిన్ విషయంలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు. ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (87.8 హెచ్‌పీ పవర్) కొనసాగనుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అలాగే ఉంటాయి. సీఎన్జీ ఆప్షన్ కూడా కొనసాగుతుంది. ధరలో మాత్రం తేడా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ కంటే సుమారు రూ. 30,000 - రూ.50,000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.