2023 టాటా సఫారి ఎన్ని వేరియంట్లో లభిస్తుందో తెలుసా.. ఇవే వాటి ఫీచర్లు
టాటా మోటార్స్ ఇటీవలే 2023 సఫారి ఎస్.యూ.వీ SUVని ఆవిష్కరించింది, స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే నాలుగు ప్రధాన మోడల్స్ లో లభిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ వేరియంట్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ LED DRL స్ట్రిప్, ఫాబ్రిక్ అప్హోల్స్టరీతో అనేక రకాల భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్యూర్ మోడల్ షార్క్-ఫిన్ యాంటెన్నా, డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలు, వెనుక వైపర్, వాషర్, రివర్సింగ్ కెమెరాను జోడిస్తుంది. ఈ మేరకు వినియోగదారులు కొత్త సఫారీని రూ. 25,000 వేలతో ఆన్‌లైన్ లో టాటా డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
టాటా డార్క్ ఎడిషన్‌లో సఫారి అడ్వెంచర్+, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ వేరియంట్‌లు
సఫారీ అడ్వెంచర్ వెర్షన్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు LED ఫాగ్ ల్యాంప్స్, టాన్ అప్హోల్స్టరీ, కూల్డ్ స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి. ఇది మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఎత్తు-సర్దుబాటు డ్రైవర్ సీటు, వెనుక విండో సన్‌షేడ్, మల్టీ-డ్రైవ్ మోడ్‌లతో నిక్షిప్తమై ఉంది. టాటా డార్క్ ఎడిషన్‌లో సఫారి అడ్వెంచర్+, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ వేరియంట్‌లను అందిస్తోంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (AT మాత్రమే), 360-డిగ్రీ కెమెరాతో వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తాయి.
రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరగా అంచనా
టాటా సఫారి 2023 ఫేస్ లిఫ్టెడ్ ప్రస్తుత లేటెస్ట్ మోడల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. ఇది 168hp శక్తిని 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పొందుపర్చారు. సవరించిన ధరల ప్రకారం టాటా సఫారి సుమారుగా రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరగా అంచనా. ఆధునీకరించిన SUV మహీంద్రా XUV700, హ్యుందాయ్ ALCAZAR, MG హెక్టర్ ప్లస్‌లకు టాటా సఫారి గట్టి పోటీనిస్తుందని ఆటోమొబైల్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.