Tata Safari : టాటా సఫారి వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు.. ఎన్ని వారాలంటే?
నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనం కొనాలనే ఆశించే ప్రతి ఒక్కరూ సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ కార్లను సూపర్ సేఫ్టీ ఫీచర్లతో రూపొందిస్తున్నాయి. ఇక ఇండియాలో భద్రతా పరంగా చూసుకుంటే టాటా కార్లదే ప్రథమ స్థానం. ఇప్పటివరకు జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అన్నింటికంటే టాప్ స్కోరు చేసి టాటా హారియర్, టాటా సఫారీలు 5-స్టార్ రేటింగ్ పొందాయి. తాజాగా టాటా మోటార్స్ తన వెయింటింగ్ పీరియన్ ప్రకటించింది. సఫారి కస్టమర్‌లు ఎంచుకున్న వేరియంట్, లొకేషన్, స్టాక్ లభ్యత కారణంగా ఆరు వారాల వరకు వేచి ఉండాలని కంపెనీ స్పష్టం చేసింది.
టాటా సఫారీలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు
టాటా సఫారి 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో దీన్ని జత చేశారు. ఇది BS6 స్టేజ్ 2-కంప్లైంట్‌తో 168hp శక్తిని, 350Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త టాటా సఫారీ... స్మార్ట్ (ఓ), ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ ఎ, అకాంప్లిష్డ్+ అనే 10 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. మంచి సేఫ్టీ కారు కావాలని అనుకునేవారికి ఈ టాటా సఫారీ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు.