టాటా సఫారీ vs హ్యుందాయ్ అల్కాజర్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్!
2023 టాటా సఫారీ ఎస్‌యూవీని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో టాటా సఫారీ ఫేస్ లిస్ట్ వర్షెన్‌కు, హ్యుందాయ్ అల్కజార్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండింటినీ పోల్చి, ఇందులో ఏ ఎస్‌యూవీ బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హ్యుందాయ్ అల్కజార్‌లో స్కల్ప్టెడ్ బానెట్, భారీ క్రోమ్ గ్రిల్, ట్రై బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ల్పిట్ టైప్ డీఆర్ఎల్స్, రూఫ్ రెయిల్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, స్కిడ్ ప్లేట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, 18 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు.
టాటా సఫారీ ఎక్స్ షోరూం ధర రూ16.19 లక్షలు
ఇక టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో పారామెట్రిక్ డిజైన్‌తో కూడిన భారీ గ్రిల్, ప్రొడెక్టర్ బై-ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫుల్-విడ్త్ డీఆర్ఎల్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, 19 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా మోటార్స్ వెహికిల్‌లో 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 168 హెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక హ్యుందాయ్ వెహికిల్ఎస్యూవీలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 157 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇండియాలో టాటా సఫారీ ధర రూ. 16.19లక్షలు-రూ. 27.34లక్షల మధ్యలో ఉండగా, హ్యుందాయ్ అల్కజార్ ధర రూ. 16.77లక్షలు- రూ. 21.23లక్షల మధ్యలో ఉండనుంది.