Tata Sierra: మళ్లీ రంగంలోకి టాటా సియెర్రా: రేపే లాంచ్, 5 సరికొత్త ఫీచర్లు ఇదిగో!
ఈ వార్తాకథనం ఏంటి
2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా సియెర్రా ప్రధానంగా నిలుస్తోంది. ఈ ఎస్‌యూవీ రేపు, అంటే 25 నవంబర్ 2025న భారత మార్కెట్లో అధికారికంగా ప్రవేశించనుంది. 1991లో మొదటిసారి భారత రోడ్లపై దర్శనమిచ్చిన సియెర్రా,ఇప్పుడు పూర్తిగా మారిన రూపంలో మళ్లీ భారతీయుల ముందుకు రానుంది. ప్రారంభంలో ఇది పెట్రోల్,డీజిల్ ఇంజిన్‌లతో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత కొద్ది నెలల్లో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా విడుదల కానుంది. రూపం,రోడ్ ప్రెజెన్స్ మాత్రమే కాదు... టెక్నాలజీ పరంగానూ ఈ సారి సియెర్రా బాగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఇందులో ఉన్న కొన్ని ఫీచర్లు టాటా కార్లలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించనివే. టాటా మోటార్స్ చరిత్రలోనే తొలిసారిగా సియెర్రాతో వచ్చే ఐదు కొత్త ఫీచర్లు ఇవే...
వివరాలు
టాటా సియెర్రా ఎస్‌యూవీ..5 తాజా ఫీచర్లు
1. ట్రిపుల్-స్క్రీన్ లేఔట్ 25 నవంబర్‌కి లాంచ్ కాబోతున్న సియెర్రాలో పూర్తిగా కొత్త మూడువేల స్క్రీన్ సెటప్ ఉంటుంది. డ్రైవర్ కోసం ప్రత్యేక డిస్‌ప్లే, మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్యాసింజర్ కోసం అదనపు స్క్రీన్ — ఇలా మూడు డిస్‌ప్లేలు ఒకే డాష్‌బోర్డ్‌లో అమర్చబడ్డాయి. మిడ్-సైజ్ ఎస్‌యూవీల విభాగంలో ఇలా మూడు స్క్రీన్లు అందించడం ఇదే మొదటిసారి. టాటా మోటార్స్ కోసం కూడా ఇది కొత్త ప్రయోగమే. కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అలాగే ఇన్‌బిల్ట్ యాప్‌లు — ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ బేస్ మోడళ్లలో రావడం కష్టమే.
వివరాలు
2. జేబీఎల్ ప్రీమియం ఆడియో + సౌండ్ బార్
సియెర్రాలో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన 12 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్ అందిస్తున్నారు. వీటితో పాటు డాష్‌బోర్డ్ మీద, మధ్య ఏసీ వెంట్స్ కింద సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్ కూడా ఉండబోతోంది. ఈ సెటప్ మొత్తం కారు లోపల ఉన్నవారికి థియేటర్ లాంటి ఆడియో అనుభవాన్ని ఇస్తుంది. 3. అడ్జెస్ట్ అయ్యే అండర్-థై సపోర్ట్ & ఎక్స్‌టెండబుల్ సన్ వైజర్లు ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా టాటా మోటార్స్ ఫ్రంట్ సీట్లకు మాన్యువల్ అండర్-థై సపోర్ట్ అడ్జస్ట్మెంట్ అందిస్తోంది. ఎత్తుగా ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా చాలా కంఫర్ట్ ఇస్తుంది. అలాగే సన్ వైజర్లు కూడా సాధారణవి కావు.. వీటిని పొడిగించి కిందికి, ఇంకా పక్కకు కూడా విస్తరించేలా రూపొందించారు.
వివరాలు
4. సహాయక టెయిల్ ల్యాంపులు
దీంతో ముందు విండ్‌షీల్డ్‌కి, అలాగే సైడ్ విండోలకు కూడా మరింత కవరేజ్ లభిస్తుంది. సియెర్రాలో ఉండే ఆక్సిలరీ టెయిల్ లైట్లు బూట్ లిడ్ తెరిచిన వెంటనే ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. రాత్రి సమయంలో బ్యాగులు ఎత్తిపెట్టడం, వస్తువులను కనుగొనడం మరింత సులభమవుతుంది. మాస్ మార్కెట్ కార్లలో ఇలాంటి ఫీచర్ దాదాపు లేనట్టే, టాటా మోడళ్లలో కూడా ఇదే మొదటిసారి.
వివరాలు
5. కొత్త 1.5 లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్
హైపెరియన్ పవర్‌ట్రైన్ సిరీస్‌లో భాగంగా టాటా తయారు చేసిన 1.5 లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్ను సియెర్రాతో తొలిసారి తీసుకొస్తున్నారు. ఇది సుమారు 168 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదని అంచనా. మాన్యువల్, ఆటోమేటిక్.. రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. సియెర్రాకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు మరియు అన్ని వేరియంట్ వివరాలు రేపటి లాంచ్ తర్వాత అధికారికంగా తెలుస్తాయి.