Tata Sierra: మార్కెట్‌లోకి టాటా సియారా విడుదల .. ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) తన ప్రసిద్ధ ఎస్‌యూవీ సియారా (Tata Sierra)ను మరోసారి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మొదటగా 1991లో విడుదలైన ఈ మోడల్‌ను 2003లో నిలిపివేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పటి అవసరాలు, హంగులతో కొత్త సియారాను మళ్లీ తీసుకొచ్చారు. పాత సియారా రెట్రో లుక్‌ను సరికొత్త రూపంలో కొనసాగిస్తూ, టాటా దీన్ని "రీబర్త్ ఆఫ్ ఎ లెజెండ్"గా వర్ణించింది. కొత్త సియారా ధర రూ. 11.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
వివరాలు
🔧 ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ వివరాలు
బుకింగ్‌లు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. టాటా డీలర్ల వద్దతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 2026 జనవరి 15 నుంచి వాహన డెలివరీలు మొదలవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త సియారా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికల్లో లభిస్తోంది. అందుబాటులో ఉన్న ప్రధాన ఆప్షన్లు: 1.5 లీటర్ నాచురల్లి యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్ / 7-స్పీడ్ DCA పవర్: 106 PS టార్క్: 145 Nm 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమెటిక్ పవర్: 160 PS టార్క్: 255 Nm
వివరాలు
త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ వెర్షన్
1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమెటిక్ పవర్: 118 PS టార్క్: మాన్యువల్: 260 Nm ఆటోమెటిక్: 280 Nm అదనంగా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా త్వరలో విడుదల కానుంది. మొత్తం 6 రంగుల్లో వాహనం అందుబాటులో ఉంటుంది.
వివరాలు
ఫీచర్లు & భద్రత
కొత్త సియారా పలు ఆధునిక ఫీచర్లతో వస్తోంది: పనోరమిక్ సన్‌రూఫ్ వెంటిలేటెడ్ & పవర్డ్ ఫ్రంట్ సీట్స్ డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లెవల్-2 ADAS సపోర్ట్ 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగులు మెరుగైన రక్షణ కోసం సీట్‌బెల్ట్ యాంకర్ ప్రీ-టెన్షనర్లు డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ఇన్‌బిల్ట్ 5G కనెక్టివిటీ సేఫ్టీ రేటింగ్ పరంగా, వాహనాన్ని మరో సియారాతో రియల్-లైఫ్ క్రాష్‌లో పరీక్షించగా, ఇది 5-స్టార్ రేటింగ్‌ను మించే భద్రతా ప్రమాణాలు అందించగలదని టాటా పేర్కొంది. ఈ కొత్త మోడల్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి మధ్యస్థాయి ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.