
Tata Sierra New Generation : టాటా సియెర్రా న్యూ జనరేషన్ ఎస్‌యూవీ రాబోతోంది.. ప్రీమియం ఇంటీరియర్ హైలైట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ తన న్యూ జనరేషన్ 'సియెర్రా ఎస్‌యూవీ'ని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఏడాది ఆరంభంలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'లో ఈ మోడల్‌ను తొలిసారిగా ప్రదర్శించారు. అధికారిక విడుదల తేదీని టాటా ఇంకా ప్రకటించకపోయినా, దీపావళి 2025 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం బలంగా వినిపిస్తోంది. ఈ ఎస్‌యూవీ రోడ్డు టెస్టింగ్‌లో పలు సార్లు కనిపించడం, తాజాగా బయటకు వచ్చిన స్పై చిత్రాలు దీని ఇంటీరియర్ ప్రీమియం ఫీచర్లని మరింత హైలైట్ చేస్తున్నాయి.
Details
ఇంజిన్, ఫీచర్లు
కొత్త టాటా సియెర్రా ఎస్‌యూవీ 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇవి టాటా నెక్సాన్ నుంచి తీసుకోవచ్చని, అలాగే హ్యారియర్‌లో ఉపయోగించే 2.0-లీటర్ మల్టీజెట్ ఇంజిన్‌ను కూడా అందించే అవకాశం ఉందని టాక్. అంతేకాదు, ఈ మోడల్‌కి ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా రానుంది. వివిధ బ్యాటరీ ఆప్షన్లతో ఈవీ వెర్షన్‌ను ఆఫర్ చేయడానికి టాటా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజాగా టాటా హ్యారియర్ ఈవీలో పరిచయం చేసిన 'క్వాడ్ వీల్ డ్రైవ్' ఫీచర్‌ను సియెర్రా టాప్-ఎండ్ వేరియంట్లలో కూడా పొందుపరచే అవకాశం ఉంది.
Details
ఇంటీరియర్ డిజైన్
స్పై చిత్రాల ద్వారా బయటపడిన సమాచారం ప్రకారం, సియెర్రా ఇంటీరియర్ మరింత టెక్-రిచ్ లుక్‌తో కనిపిస్తోంది. ముఖ్యంగా మూడు పెద్ద స్క్రీన్‌ల అమరిక దృష్టిని ఆకర్షిస్తోంది డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే పెద్ద సెంటర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ముందు ప్రయాణికుల కోసం ప్రత్యేక స్క్రీన్ ఈ మూడు స్క్రీన్‌లు దాదాపు 12.3 ఇంచ్ సైజుతో ఫ్లోటింగ్ డిజైన్‌లో ఉండనున్నాయి. వీటి రూపకల్పన, ఎక్స్‌పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్‌కు దగ్గరగా ఉంది. డాష్‌బోర్డ్‌లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, విస్తృతంగా అమర్చిన యాంబియంట్ లైటింగ్ ప్రత్యేకతగా నిలుస్తాయి. అలాగే కొత్తగా డిజైన్ చేసిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్ మధ్యలో మెరిసే బ్రాండ్ లోగోతో ఆకట్టుకోనుంది.
Details
ఎక్స్‌టీరియర్ డిజైన్
బయటి డిజైన్ విషయానికొస్తే, సియెర్రా బాక్సీ లుక్‌తో రగ్గడ్ ఫీలింగ్ ఇస్తుంది. రోడ్డు టెస్టింగ్ ఫోటోల్లో గమనించిన కొన్ని హైలైట్స్: ఫుల్ వెడల్పు ఎల్‌ఈడీ స్ట్రిప్ సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు రగ్గడ్ బంపర్ డిజైన్ ఈ అంశాలన్నీ కొత్త సియెర్రా ఎస్‌యూవీని మరింత స్టైలిష్, ప్రీమియంగా చూపిస్తున్నాయి. లాంచ్ వివరాలు లాంచ్ సమయానికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ, ఈ ఎస్‌యూవీతో పాటు ఈవీ వర్షన్ ను కూడా రిలీజ్ చేయాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోందని సమాచారం.