Tesla : 20 లక్షల కార్లను రీకాల్ చేయనున్న టెస్లా.. ఎందుకంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా(Tesla) సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా విక్రయించిన దాదాపు 20 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. టెస్లా కార్లలోని ఆటో పైలట్ అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలో కొత్త సేఫ్ గార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు, ఈ సిస్టమ్‌ను మిస్ యూస్ చేయకుండా రక్షణ తీసుకునేందుకు టెస్లా కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిసింది. 2012 అక్టోబర్ ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఎన్‌హెచ్‌టీఎస్ఎ టెస్లా కార్లపై రెండేళ్లుగా దర్యాప్తు చేస్తోంది. డ్రైవర్ల అసిస్టెన్స్ సిస్టమ్ వాడే సమయంలో కార్ డ్రైవర్ జాగ్రత్తగా ఉంటున్నాడా లేదా? అని దర్యాప్తు చేస్తోంది.
ఇప్పటికే 22 మంది మరణించారన్న ఎన్‌హెచ్‌టీఎస్ఎ
పేరుకే ఆటోపైలట్ సిస్టమ్ అయినప్పటికీ ఇది డ్రైవర్‌కు కొంత అసిస్టెంట్‌గా మాత్రమే పనిచేయగలదు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్ చేయడం, బ్రేకులు వేయడం వంటి పనులను చేస్తుంది. టెస్లా వాహనాలు స్టేషనరీ ఎమర్జెన్సీ వాహనాలను ఢీకొన్న సంఘటనల తర్వాత ఆగస్టు 2021లో ఆటోపైలట్ వ్యవస్థపై దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్‌హెచ్‌టీఎస్ఎ ప్రకారం టెస్లా ఆటోపైటల్ వ్యవస్థ వల్ల ఇప్పటి వరకు ప్రమాదాల్లో 23 మంది మరణించారు.