
టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ!
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా సంస్థ చరిత్రలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇండియాలో టెస్లా ఎంట్రీపై అంచనాలు ఎక్కువయ్యాయి.
టెస్లా రూపొందించే ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా ఇండియా కోసం తయారు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఇండియాలో పెద్ద ఈవీ మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఈ నెలలో టెస్లా బృందం భారత కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నట్లు సమాచారం.
ఇండియాలో ఆల్ న్యూ టెస్లా కారు వస్తోందని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం 24 లక్షలు ఉండొచ్చు. చైనాలో దీని ధర సుమారు రూ.26 లక్షలు ఉంది.
Details
ఇండియాలో టెస్లా ఎంట్రీకి ప్లాన్!
ఇండియాలో ఈవీ వాహనాలకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. దీంతో 25శాతం తక్కువ దరకే ఇండియాలో ఆల్ న్యూ టెస్లా కారును అందించాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
చరిత్రలో చౌకైన ఈవీతో ఎంట్రీ ఇచ్చి మార్కెట్ లో తమ డిమాండ్ ను పెంచుకోవాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా టెస్లా చూస్తోంది. అయితే ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇస్తే కొన్ని మినహాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడిన పాలసీలను మార్చాలని టెస్లాకు చెప్పామని, అవసరమైతే వారు పీఎల్ఐ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.