2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా 2025 చివరి నాటికి చైనాలో ప్రసిద్ధి చెందిన మోడల్ Y SUV ఆరు-సీట్ల వెర్షన్‌ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ వ్యూహాత్మక చర్య ద్వారా టెస్లా తన అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనం ఆకర్షణను తీర్చిదిద్దాలని ప్రయత్నించింది. షాంఘై ఫ్యాక్టరీలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెస్లా ఇప్పటివరకు అనుమతికి ఎదురుచూస్తోంది. టెస్లా, షాంఘైలోని తన సదుపాయంలో మోడల్ Y ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని తన సరఫరాదారులకు సూచించినట్లు నివేదికలు ధ్రువీకరించాయి.
డ్రైవింగ్ టెక్నాలజీపై దృష్టి
దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల నుంచి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో టెస్లా ఈ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిసింది. 2020లో ప్రారంభించబడిన మోడల్ Y ప్రస్తుతం "జూనిపర్" ప్రాజెక్ట్ కింద పునర్నిర్మాణంలో ఉంది. 2025 ప్రారంభంలో ఈ పునరుద్ధరించిన మోడల్ ఐదు-సీట్ల వెర్షన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 207,800 యూనిట్ల విక్రయాలు సాధించింది. అమెరికాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీపై దృష్టి సారించింది. చైనాలో మాత్రం దేశీయ తయారీదారుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం చైనాలో కనీసం నలుగురు కొత్త మోడల్ Y పోటీదారులు మార్కెట్లోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మోడల్‌లు మరింత విశాలమైన ఇంటీరియర్స్‌ను అందించడం, తక్కువ ధర కలిగి ఉండడం విశేషం