Page Loader
ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!
ఆగస్టు 3న ఏథర్ 450 s విడుదల

ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2023
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆగస్టు 3న ఈ బైక్ ను లాంచ్ చేస్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 1.3లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ బైకును ఒక్కసారి ఛార్జీ చేస్తే దాదాపు 115 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని ఏథర్ ఎనర్జీ కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్‌లో 3.7kWh బ్యాటరీ కలిగి ఉంది. Ather 450S బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉండడం విశేషం. ఓలాకు పోటీగా ఏథర్‌ ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

Details

ఏథర్ 450S మోడల్స్‌ లో స్వల్ప మార్పులు

మరోవైపు విద్యుత్ వాహనాలకు ఇచ్చే సబ్సిడిలో కేంద్రం కోత పెట్టడంతో FAME-II సబ్సిడీతో 450X ఈ-స్కూటర్ ధర మరింత పెరిగింది. ఇది 90kph టాప్ స్పీడ్‌తో 450Xతో సమానంగా ఉండనుంది. 450Sలో బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ డాష్‌ని కలిగి ఉంటుందని Ather సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇందులో 7 ఇంచెస్TFT టచ్‌స్క్రీన్, ఆటో హోల్డ్, రైడింగ్ మోడ్ వంటి ఫీచర్స్ బహుశా ఉండకపోచ్చు. ఏథర్ 450S మోడల్స్‌లో కొన్ని టెక్నికల్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.