Page Loader
Ampere Reo 80: సిటీ రైడింగ్‌కి బెస్ట్‌ స్కూటర్‌ వచ్చేసింది.. లైసెన్స్‌ అవసరం లేదు! ధర ఐఫోన్‌ 16 కంటే తక్కువ!
సిటీ రైడింగ్‌కి బెస్ట్‌ స్కూటర్‌ వచ్చేసింది.. లైసెన్స్‌ అవసరం లేదు! ధర ఐఫోన్‌ 16 కంటే తక్కువ!

Ampere Reo 80: సిటీ రైడింగ్‌కి బెస్ట్‌ స్కూటర్‌ వచ్చేసింది.. లైసెన్స్‌ అవసరం లేదు! ధర ఐఫోన్‌ 16 కంటే తక్కువ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

సిటీ డ్రైవింగ్‌ కోసం ఓ మంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనాలనుకుంటున్నారా? అయితే యాంపియర్‌ రియో 80 (Ampere Reo 80) మీ కోసం మంచి ఎంపిక అవుతుంది. ఈ స్కూటర్‌ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా, దీనికి లైసెన్స్‌ అవసరం లేదన్న విషయం తెలిసిందే. లైసెన్స్‌ లేని లో-స్పీడ్‌ స్కూటర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చిన యాంపియర్‌ రియో 80 ఒక లో-స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. దీని టాప్‌ స్పీడ్‌ 25 కేఎంపీహెచ్‌ మాత్రమే కాబట్టి, భారత నిబంధనల ప్రకారం దీనికి లైసెన్స్‌ అక్కర్లేదు. అదే కాదు రిజిస్ట్రేషన్‌ కూడా అవసరం లేదు.

Details

 ఫీచర్లు అదిరిపోయేలా

రియో 80లో కలర్డ్‌ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, కీలెస్‌ ఎంట్రీ, డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌, అలాయ్ వీల్స్‌, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇలాంటి ఫీచర్లు కలిగిన ఈ-స్కూటర్‌ అరుదే! బ్యాటరీ, రేంజ్ విషయమైతే? ఈ స్కూటర్‌లో ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ (LFP Battery) ఉంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 80 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చు. దీని వల్ల డేలీ సిటీ కమ్యూట్‌కి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా మారుతుంది. సాధారణ రైడింగ్‌ కోసం చూసే ఫస్ట్‌టైమ్‌ బయ్యర్లు, విద్యార్థులు, వృద్ధులు, హౌస్‌హోల్డ్‌ మెంబర్లు కోసం ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్టు సంస్థ చెబుతోంది.

Details

ధర ఎంతంటే? 

అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ యాంపియర్‌ రియో 80 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధర రూ. 59,900 నుండి ప్రారంభమవుతోంది. అంటే.. లేటెస్ట్‌ ఐఫోన్‌ 16 కన్నా తక్కువ ధరలో స్కూటర్‌ తీసుకోవచ్చు! ఈ స్కూటర్‌ ప్రస్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ల్లో అందుబాటులో ఉంది. మొత్తానికి, సిటీ రైడింగ్‌కి ఒక సురక్షిత, చౌక, లైసెన్స్‌ ఫ్రీ ఎంపిక కోసం చూస్తున్నారా? అయితే యాంపియర్‌ రియో 80 ఖచ్చితంగా మీకు సరైన స్కూటర్‌ అని చెప్పొచ్చు.