Page Loader
దూసుకెళ్తున్న కియా.. ఎలక్ట్రికల్ కార్ల తయారీపై దృష్టి!
దూసుకెళ్తున్న కియా.. ఎలక్ట్రికల్ కార్ల తయారీపై దృష్టి!

దూసుకెళ్తున్న కియా.. ఎలక్ట్రికల్ కార్ల తయారీపై దృష్టి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2023
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ భారత విపణిలో తమ మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటుంది. ఇప్పటికే చాలా రకాల మోడళ్లను ప్రవేశపెట్టిన సంస్థ, తాజాగా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లోకి 2025 నాటికి మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయని కియా ఇండియా ఎండీ సీఈవో టే-జిన్‌ పార్క్‌ వెల్లడించారు. సెల్టోస్ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే కంపెనీ ఈవీ విభాగంలో EV6 ని తీసుకురాగా, వచ్చే ఏడాది తీసుకువచ్చే కారు రెండో మోడల్ అవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా EV9లో మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలు అందుబాటులో ఉండడం విశేషం.

Details

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందే అవకాశం

కియా 2.0 వ్యూహంలో భాగంగా సమీప భవిష్యత్తులో భారత ప్యాసింజర్‌ వెహికల్స్‌ మార్కెట్లో కంపెనీ వాటాను 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం కియాకు సుమారు 7శాతం వాటా ఉండగా, 2030నాటికి మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 20శాతం చేరుతుందని ఇప్పటికే అంచనా వేశారు. కొత్తగా వచ్చే మూడు మోడళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కియా అభివృద్ధి చేసిన రీక్రియేషనల్‌ (వినోద) వెహికల్స్‌. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ ప్లాంటులో వీటిని అసెంబుల్‌ చేస్తామని సంస్థ యాజమాన్యం వెల్లడించింది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఏడాది వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.5 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్టు స్పష్టం చేశారు. భారత్‌లో 2025 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతుందని కంపెనీ అంచనా వేస్తోంది